India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తరలి వ్యక్తి మృతి చెందిన ఘటన రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంట మణికంఠ రెడ్డి (32) తన ఇంటి ఎదురుగా ఉన్న విద్యుత్ మోటారు పట్టుకోగా షాక్ తగిలి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రైలు కిందపడి యువకుడు మృతిచెందిన ఘటనపై సోమవారం గుంటూరు GRP పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంబూరు నుంచి రెడ్డిపాలెం వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై యువకుడి మృతదేహం ఉందని సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్ వెళ్లి పరిశీలించారు. యువకుడి పేరు, వివరాలు తెలియలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివరాలు తెలిసిన వాళ్లు GRP పోలీసులను సంప్రదించాలన్నారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ నరసరావుపేట లోక్‌సభ వైసీపీ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈయనే కాదు, నెల్లూరు నేతలు పలు ప్రాంతాల్లో పోటీ చేసి గెలిచారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నరసరావుపేట, విశాఖ, బాపట్ల MPగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒంగోలు, నరసరావుపేట MPగా, పనబాక లక్ష్మి బాపట్ల MPగా విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో అనిల్ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలను వర్గపోరు వెంటాడుతోంది. ఇప్పటికే వైసీపీ రెబల్ అభ్యర్థిగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుకు వ్యతిరేకంగా పూనాటి రమేశ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయటంతో నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. వర్గపోరును తట్టుకొని ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.
విద్యాహక్కుచట్టం-2009 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లలో ఉచితంగా ప్రవేశం పొందటానికి ఆన్లైన్ దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈనెల 31 వరకు పొడిగించినట్లు డీఈవో శైలజ ఆదివారం తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అప్పులు తీర్చినా మరింత చెల్లించాలంటూ, రుణదాతలు వేధిస్తున్నారని కొత్తపేటలోని మెడికల్ ల్యాబ్‌లో పనిచేసే కూరాకుల శివప్రసాద్(38) అనే వ్యక్తి వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో చూసిన మిత్రులు అక్కడికి చేరుకుని అతనిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలక్టరేట్‌లో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కో ఆర్డినేషన్ సెక్షన్, లీగల్ సెల్, మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ విభాగం, సువిధ పోర్టల్ విభాగాన్ని అందుబాటులో ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం పరిశీలించి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల విధులు గురించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
నవ యువతరం ఫౌండేషన్ సేవాసంస్థ అధినేత, ఫౌండర్ చిగుళ్ల సుమలతను పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అభినందించారు. సేవా సంస్థ ద్వారా సమాజానికి అందించిన సేవలకు, వివిధ రంగాలలో కనపరిచిన ప్రతిభను చూసి ఆమెకు ఉమెన్స్ వరల్డ్ రికార్డ్సు అండ్ అవార్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉత్తరప్రదేశ్ ఉమెన్ ఐకాన్-2024 అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మెరుగైన సేవలు ఇంకా సమాజానికి అందించాలని కలెక్టర్ అన్నారు.
ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామానికి చెందిన దొప్పలపూడి రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. దొప్పలపూడి రాజేష్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తన మృతికి ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోటు రాసి మరణించాడు.
కారంపూడి మండలంలోని కారంపూజీ-2లో వాలంటీర్‌గా పని చేస్తున్న షేక్. మజూజి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫొటోలు, వీడియోలు స్టేటస్‌గా పెట్టడం వల్ల, అతడ్ని విధుల నుంచి తొలగిస్తున్నట్టు మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.