India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు జగన్ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజనీతో కలిసి గురువారం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. జగన్ పాలనకు ప్రజలు మరోసారి మద్దతు తెలిపాలని సూచించారు.

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశాలకు ఈనెల 9 నుంచి జూన్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయకర్త, తెనాలి ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఆన్లైన్ విధానంలోనూ నమోదు చేసుకోవచ్చని, వివరాలకు జిల్లాలోని ఐటీఐల్లో సంప్రదించాలని సూచించారు.

పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక ప్రదేశాలలో 800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మే 13న జనరల్ ఎలక్షన్ 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరగనుందని అన్నారు. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామన్నారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను ఈ నెల 11వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి అరుణకుమారి తెలిపారు. ఈ సమయంలో ఎవరైనా మద్యం విక్రయించినా, రవాణా చేసినా సీజ్ చేస్తామన్నారు. వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు గుంటూరు జిల్లాకు ఎలక్షన్ కమిషన్ 9 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయించింది. వారితో జిల్లా ఎస్పీ తుషార్ బుధవారం పోలీస్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి తెలుసుకొని ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. ఏఎస్పి షెల్ కె, మనోజ్ హెగ్డే పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గడువును ఈ నెల 9 వరకు పొడిగించినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బుధవారం తెలిపారు. ఉద్యోగులు వారి ఓటు హక్కును కోల్పోరాదనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ గడువును పొడిగించిందన్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలలో గురువారం కూడా ఫెసిలిటేషన్ కేంద్రాలు కొనసాగుతాయన్నారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

సార్వత్రిక ఎన్నికలు-2024 లో బాగంగా ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ స్టేషన్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల పరిశీలకులు, కేంద్ర బలగాలు ,పోలీస్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బుధవారం జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ వకుల్ జిందాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందురోజు వరకు ప్రతి గ్రామాల్లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని తెలిపారు. హోటల్స్, లాడ్జిలను తనిఖీ చేస్తూ అనుమానితులు ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

పల్నాడు జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు ఈ నెల 9న నర్సరావుపేటలో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అనివార్య కారణాల చేత ఓటు వేయని ఉద్యోగులకు నరసరావుపేట SSN కాలేజీలో గల ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు. ఫామ్ 12 సమర్పించి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన తప్పట్ల పాపారావు అనే రైతు మంగళవారం కురిసిన అకాల వర్షానికి పిడుగుపడి మరణించినట్లు మృతుడి కుమారుడు తెలిపారు. మృతుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాడని, పొలం నుంచి వస్తుండగా పిడుగు పడి మరణించినట్లు వివరించారు. ఈ మేరకు నకరికల్లు పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.