India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దళిత సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో బుధవారం జరిగే పరీక్షల తేదీలలో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 27కి, బీటెక్ మొదటి, 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు, బీటెక్ 2వ ఏడాది ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 3వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు.
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌సీఎల్ రాష్ట్రంలో విస్తరణకు సిద్ధమైంది. సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఏపీలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఫేజ్-2లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రైవేట్ క్యాంప్ కార్యాలయంలో తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా మినియేచర్ బొమ్మలతో మ్యూజియం తరహా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో ఘనతను తెలియజేశారు. బొమ్మలు, శిల్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఈ మేరకు మంగళవారం పవన్ మ్యూజియంలో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.
టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్ విభాగంతో రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేయాలన్నారు.
పిడుగుపాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండల పరిధిలోని పొన్నపల్లి గ్రామానికి చెందిన వారే తిరుపతమ్మ(35) పొలంలో నాటు వేస్తుంది. ఈ క్రమంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫోన్ దొంగిలించి, రూ.లక్ష కాజేసిన ఘటన మంగళగిరిలో జరిగింది. శ్రీనగర్ కాలనీకి చెందిన రమేశ్ సోమవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తి అతని ఫోను దొంగలించారు. నగదు కోసం బ్యాంకుకు వెళ్లి అకౌంట్ చూడగా ఫోన్ పే ద్వారా రూ. లక్ష పలువురికి బదిలీ అయినట్లు గుర్తించి, మంగళగిరి పోలీసులను ఆశ్రయించాడు. ముగ్గురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
చీరాల-వేటపాలెం బైపాస్‌లో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి ఓ బాలిక మృతిచెందింది. పోలీసుల వివరాల మేరకు.. పిట్టలవానిపాలెంకు చెందిన వెంకటేశ్వరరెడ్డి తన భార్య లలిత, కుమార్తెలు నందిని, రేణుకాదేవితో వాడరేవు సమీపంలో ఉన్న పచ్చమొగలి గ్రామానికి వెళ్లారు. అక్కడ లలిత తన సోదరుడికి రాఖీ కట్టగా.. నలుగురు బైకుపై నివాసం ఉంటున్న చినగంజాం తిరుగుపయనమయ్యారు. వీరి బైకును కారు ఢీకొట్టగా నందిని అక్కడికక్కడే చనిపోయింది.
* గుంటూరు: 21న జిల్లా అథ్లెటిక్ జట్ల ఎంపిక
* తోడబుట్టిన తమ్ముడిలా అభిమానించారు: లోకేశ్
* పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
* గుంటూరు: కెమెరామేన్ అవతారమెత్తిన సీఎం
* పల్నాడు: TDP కార్యాలయంలో కత్తులతో దాడి
* YS జగన్‌కు రాఖీ కట్టిన విడదల రజనీ
* గుంటూరు: అన్న క్యాంటీన్‌కు రూ.కోటి విరాళం
పొన్నూరు మండలం మామిళ్లపల్లి అడ్డరోడ్డు వంతెన ప్రక్కన సోమవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో పొన్నూరు రూరల్ పోలీసులు కనుగొన్నారు. ఎత్తు సుమారు 4.5, నల్ల జాకెట్టు, మెడలో పసుపు తాడు, పసుపు లంగా ధరించి మృతదేహం సగభాగం కుళ్లిపోయిందని రూరల్ పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతికి గల కారణం తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్‌కు ఈ మేరకు రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోహిత్‌ను అభినందించారు.
Sorry, no posts matched your criteria.