Guntur

News March 18, 2026

GNT: టెన్త్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

image

వట్టిచెరుకూరు బీసీ హాస్టల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి రాకేశ్ ఆత్మహత్య ఘటనపై మంత్రి సవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఒత్తిడికి గురికాకుండా చూడాలని హాస్టల్ యాజమాన్యానికి సూచించారు. మార్కులే జీవితంలో ముఖ్యం కాదని చెప్పారు.

News March 18, 2026

GNT: సీఎం భద్రతా సిబ్బందికి పతకాలు

image

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు వ్యక్తిగత భద్రతా విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలకు ఎంపిక చేసింది. CM ప్రత్యేక రక్షణ అధికారి మధుసూదన్‌కు ‘మహోన్నత సేవా పతకం’, కాన్వాయ్ డ్రైవర్ గిరిబాబుకు ‘ఉత్తమ సేవా పతకం’ ప్రకటించింది. 2019 నుంచి మధుసూదన్ CM వద్ద సేవలు అందిస్తుండగా, గిరిబాబు గత 15ఏళ్లుగా చంద్రబాబు కాన్వాయ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

News March 17, 2026

GNT: స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం I&PR రూపొందించిన “స్వర్ణాంధ్ర@2047” క్యాలెండర్లను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం ఆవిష్కరించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం పేదరిక నిర్మూలన, ఉపాధి ఉద్యోగ కల్పన, నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి, వ్యవసాయంలో సాంకేతికత, ప్రపంచ స్థాయి రవాణా, స్వచ్ఛ ఆంధ్ర 10 సూత్రాలతో విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు.

News March 17, 2026

ప్రమాదాలు తగ్గాయి.. ఇదే చొరవ కొనసాగించాలి: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది తగ్గాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రహదారి భద్రత కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. 2024లో 1,046 ప్రమాదాలు జరిగాయని, 2025 లో 910 జరిగాయని తెలిపారు. మరణాలు కూడా 19 శాతం తగ్గాయని చెప్పారు.

News March 17, 2026

మంగళగిరి: దివ్యాంగులకు రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం!

image

రాష్ట్రంలోని 40 శాతం వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకాన్ని ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు మంగళగిరి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలుత గుంటూరులో అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వేదికను మంగళగిరికి మార్చారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు.

News March 17, 2026

మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం

image

మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) నూతన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా ప్రారంభించారు. అధికారులకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ఆ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేలా అధికారులు గట్టి కృషి చేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.

News March 17, 2026

GNT-VJA ప్రయాణానికి కొత్త యూటర్న్ మార్గం

image

గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలకు కొత్త మార్గం అమల్లోకి రానుంది. బైపాస్‌ను ప్రధాన హైవేతో కలిపిన తర్వాత నేరుగా వెళ్లే అవకాశం ఉండదు. కాజా టోల్ దాటి మురుగన్ హోటల్ వద్ద సర్వీస్ రోడ్డులోకి మళ్లాలి. అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి హైల్యాండ్ వద్ద యూటర్న్ తీసుకొని మళ్లీ హైవేలో చేరాలి. ఈ మార్గానికి సంబంధించిన రోడ్డు పనులు చివరి దశలో ఉన్నాయి. సూచిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు.

News March 17, 2026

పుకార్లు నమ్మొద్దు, రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: నాదెండ్ల

image

రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవొద్దని ఆయన సూచించారు. రోజుకు 2.81 లక్షల బుకింగ్స్ వస్తుంటే, అంతకంటే ఎక్కువగా 2.92 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు OTP ద్వారా గ్యాస్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్యానికి వాడిన వారిపై 616 కేసులు నమోదు చేశామన్నారు.

News March 17, 2026

GNT: నాటకరంగ దిగ్గజం పెద్ది రామారావు

image

రచయిత పెద్ది రామారావు గుంటూరు జిల్లా ఉన్నవ గ్రామంలో 1973 మార్చి 17న జన్మించారు. ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పీహెచ్‌డీ చేశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ప్రసిద్ధ ‘ఋతురాగాలు’ సీరియల్‌కు ఆయన మాటల రచయితగా పనిచేశారు. ‘యవనిక’ అనే నాటక మాసపత్రికను నడిపి నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. చిరంజీవి ‘అందరివాడు’, ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమాలకు ఆయన సహ రచయితగా కూడా వ్యవహరించారు.

News March 17, 2026

నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నేటి పర్యటన వివరాలు ఖరారయ్యాయి. ఉదయం 11 గంటలకు ఆయన రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) పనితీరుపై అధికారులతో ఆయన కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3.20 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.