Guntur

News December 25, 2024

వైసీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి

image

చిలకలూరిపేట: వైయస్సార్సీపి ఆధ్వర్యంలోఈ నెల 27 నిర్వహించబోయే పోరుబాట పోస్టర్‌ను మాజీ మంత్రి విడుదల రజిని బుధవారం ఆవిష్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచిందన్నారు. యూనిట్‌కి రూపాయన్నర పెంచారన్నారు. రూ.15,485 కోట్లు భారం మోపడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని మాజీ మంత్రి విమర్శించారు.

News December 25, 2024

FLASH: నరసరావుపేట హైవేపై బస్సు బోల్తా

image

నరసరావుపేట మండలం ఉప్పలపాడు-పెట్లూరివారిపాలెం మధ్య ఉన్న రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న నరసరావుపేట అగ్నిమాపక సిబ్బంది, గ్రామీణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

News December 25, 2024

ఏసుక్రీస్తు బోధనలు మార్గదర్శకం: మంత్రి లోకేశ్

image

లోక రక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం క్రిస్మస్ అని ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

News December 25, 2024

గుంటూరులో వ్యభిచారం.. నలుగురు అరెస్టు

image

గుంటూరులో వ్యభిచార గృహం నడుపుతున్న వ్యక్తితోపాటు ముగ్గురు మహిళలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేట పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాష్ నగర్‌లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తి, మహిళలతో వ్యభిచారం చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలు, వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.

News December 25, 2024

గుంటూరు: వస్తువుల కొనుగోలులో వినియోగదారులు అప్రమత్తం

image

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.‌ మనిషి పుట్టుకతోనే వినియోగదారుని జీవితం మొదలవుతుందని అన్నారు‌. ప్రతి ఒక్కరు తాము కొనే వస్తువు నాణ్యత కలిగి ఉండేలా చూసుకోవాలని చెప్పారు. తమకు ఎలాంటి మోసం జరిగిందని గ్రహించిన వెంటనే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News December 24, 2024

బెనిఫిట్ షోలపై వ్యాఖ్యల్ని ఖండించిన ఆళ్ల హరి

image

బెనిఫిట్ షోలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యల్ని రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఆళ్ళ హరి ఖండించారు. మంగళవారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. తెలంగాణాలోని ఒక ధియేటర్‌లో జరిగిన దురదృష్టకర దుర్ఘటనను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు సినీ పరిశ్రమ మొత్తంపై కత్తి కట్టడం దుర్మార్గమన్నారు. అధికారం అండతో సినీ జగత్తు ఆధిపత్యం చెలాయించాలని చూడటం తగదని అన్నారు.

News December 24, 2024

BREAKING: బొల్లాపల్లి: కాలువలో దూకిన జంట

image

బొల్లాపల్లి మండలంలో జంట సాగర్ కెనాల్‌లో దూకడం సంచలనంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలో గల సాగర్ కెనాల్‌లో మంగళవారం ఓ జంట దూకారు. గమనించిన స్థానికులు వెంటనే కాలువలో దూకిన వారి కోసం రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మహిళను రక్షించారు. చికిత్స నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 24, 2024

క్రోసూరులో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌డెడ్

image

క్రోసూరు మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామ సమీపంలో సత్తెనపల్లి నుంచి వస్తున్న కారు ద్విచక్రదారుడిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే వాహనదారుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేస్తున్నామని ఎస్ఐ నాగేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 23, 2024

మున్సిపల్ స్కూల్లో చదివి బీఎస్ఎఫ్ జవాన్

image

తెనాలి ఐతాన‌గ‌ర్‌కు చెందిన ఎ. మ‌హాల‌క్ష్మి సాధార‌ణ పేద కుటుంబంలో జ‌న్మించింది. మున్సిప‌ల్ హైస్కూల్లో చదువుకున్న ఆమె బీఎస్ఎఫ్ జవాన్ కావాలనుకున్న తన లక్ష్యాన్ని సాధించింది. క‌ఠోర శ్ర‌మ‌కు తోడు క్రమశిక్షణతో పట్టుదలగా ప్రయత్నించి ఆర్మీలో ఉద్యోగం సాధించింది. తొలి సారిగా స్వస్థలం తెనాలి వచ్చిన క్రమంలో ఆమె చదివిన ఐతాన‌గ‌ర్‌లోని ఎన్ఎస్ఎం హైస్కూల్‌లో ఉపాధ్యాయులు సోమవారం మ‌హాల‌క్ష్మిని ఘ‌నంగా స‌త్క‌రించారు.

News December 23, 2024

సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళతారు. సీఆర్డీఏ, బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం సాయంత్రం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారని సీఎం కార్యాలయం తెలిపింది.