India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరులో రుణం తిరిగి చెల్లించే విషయంలో కొందరు వ్యక్తులు కత్తులు, రాళ్లతో బీభత్సం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తాను ఇచ్చిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదని సుబ్రహ్మణ్యేశ్వర రావును నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి తమ అనుచరులను పిలుచుకొని ఒకరినొకరు కార్లతో గుద్దుకొని భయభ్రాంతులకు గురిచేశారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
వైసీపీ నేతలు వారి కళ్లకు కట్టుకున్న నీలి గంతలు విప్పుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు కనిపిస్తాయని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం జంగాలపల్లి, తూబాడులో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తూబాడులోని రూ.15 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణానికి, జంగాలపల్లిలో సీసీ రహదారులకు భూమిపూజ చేశారు.
‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా!.. అమరావతిలో ఇలా కట్టలేదని సిగ్గుపడ్డావా?’.. అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ఈ మేరకు Xలో ఆయన ఓ పోస్ట్ చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విశాఖపట్నంలోని రుషికొండ భవనాలను పరిశీలించిన విషయం తెలిసిందే. కాగా అంబటి ట్వీట్‌తో కూటమి నేతలు మండిపడుతున్నారు.
రాజధాని అమరావతికి అప్పు కాదు.. కేంద్ర ప్రభుత్వం రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబురావు అన్నారు. శనివారం అమరావతి తుళ్లూరులో సీఆర్డీఏ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబురావు మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చిత పరిస్థితి మళ్లీ తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా, పటిష్ఠంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బాలిక శైలజ మృతి బాధాకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాలిక హత్య జరిగి నాలుగు నెలలు దాటిన ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. వైసీపీ తరఫున మాజీ సీఎం జగన్ బాలిక కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నా.. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి హంతకులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు.
మాచర్లలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థి తన రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో సహచర విద్యార్థులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఇప్పటి వరకు తనతో పాటూ ఉన్న స్నేహితుడు చనిపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
అమరావతి మండలం దిడుగులో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఐదుగురు యువకులు కృష్ణా నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయారన్నారు. గమనించిన స్థానికులు ముగ్గురి యువకులను కాపాడగా, మరో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అమరావతికి రైల్వే నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 24.01 ఎకరాల భూమిని సేకరించబోతున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. కాగా గుంటూరు, పల్నాడు కృష్ణ, ఖమ్మం జిల్లాల్లో భూమిని సేకరించనున్నారు.
పెదకాకానికి చెందిన ఓ వ్యక్తి తన అన్న కుమార్తెను గర్భవతిని చేశాడని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలికకు నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి స్థానిక వైద్యుడికి చూపించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆ బాలిక మూడు నెలల గగర్భంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.14 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోపరచుకొని, గత నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నట్లు తల్లికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడకు చెందిన ఓ మహిళ కాంట్రాక్టు పనులు లేదా ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో పాటు శారీరకంగా వాడుకున్నారని ఆరోపిస్తూ మంత్రిపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు సహకరించి బాధితురాలను బెదిరించిన PAపై బెదిరింపుల కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.