India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెనుమూడి బ్రిడ్జిపై యువకుడు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. 2 రోజుల గాలింపు అనంతరం అతని మృతదేహం లభ్యమైంది. చల్లపల్లి నిమ్మలతోటకు చెందిన సుమంత్ బుధవారం సాయంత్రం కృష్ణానదిపై ఉన్న పెనుమూడి బ్రిడ్జిపై బైక్, మొబైల్, పర్స్ పెట్టి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చల్లపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెం వద్ద కృష్ణానదిలో అతని మృతదేహం లభ్యమైంది.
మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలోని భ్రమరాంబికా అమ్మవారిని భక్తులు ప్రతి శుక్రవారం కదంబ పుష్పాలు, ఆకులతో పూజిస్తారు. ఈ ఆలయంలో శ్రావణ, కార్తిక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని, కొత్త వాహనాలకు పూజలు చేయిస్తే వాటికి ఆపద రాదని భక్తులు చెబుతున్నారు. చిన్న పిల్లలను ఆలయంలోని ఉయ్యాలలో వేస్తే సుఖంగా ఉంటారని ఇక్కడి ప్రజల నమ్మకం. ప్రతి శుక్రవారం ఇక్కడ భక్తులకు అన్న సంతర్పణ చేస్తారు.
పెదపారుపూడిలో జిల్లా పరిషత్ హైస్కూల్లోని మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూసి, కాసేపు ముచ్చటించారు. మధ్యాహ్న భోజన పథకం మెనూ డిస్ ప్లేను పరిశీలించారు. మెనూ ప్రకారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు అందించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న అర్చక విభాగం, పరిపాలనా పరమైన విభాగంలో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జిల్లాలో కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఈ నెల 9,10,23,24 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో కోరారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన పౌరులందరూ తప్పనిసరిగా తమ ఓటును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు.
ఉచిత గ్యాస్ సిలెండర్ల కోసం జిల్లాలో ఇప్పటి వరకు 1.3లక్షల మంది బుకింగ్ చేసుకున్నారని, వీరిలో 70 వేల మందికి మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసినట్టు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉచిత గ్యాస్ సిలెండర్లు పొందే విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా 1967 టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
బందరు పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధిక మొత్తంలో అవసరమైన యంత్రాలను ఉపయోగించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పోర్టు నిర్మాణ పనులపై ఆయన సమీక్షించారు. 2025 డిసెంబర్ నాటికి తొలి విడత పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలన్నారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు త్వరలోనే పోర్టు పనుల సందర్శనకు వస్తానన్నారు.
జిల్లాలో నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకే నిత్యావసర సరుకులను ప్రజలకు విక్రయించాలన్నారు. ధరల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదన్నారు.
ఘంటసాల మండలం శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర ఆలయం ప్రసిద్ధమైంది. శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా వెలిసి, భక్తుల పాపాలను హరిస్తాడని భక్తుల నమ్మకం. క్రీ.పూ. 4వ శతాబ్దంలోనే ఇక్కడ స్వామి ఆలయం ఉందని, ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాలలో 57వ దిగా పిలవబడుతోంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖంలో బ్రహ్మోత్సవాలు, కార్తీకంలో పూజలు చేస్తారు. సిరికొలనుగా పిలిచే ఈ ప్రాంతం కాలక్రమేణా శ్రీకాకుళంగా రూపాంతరం చెందింది.
చల్లపల్లి మండలం కృష్ణానది తీరానా నడకుదురులోని పృథ్వీశ్వర ఆలయం ప్రసిద్ధమైంది. ఇక్కడే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసుడిని సంహరించాడని ఇతిహాసం. అందుకే ఈ ప్రాంతం నరకొత్తూరు నుంచి నడకుదురుగా రూపాంతరం చెందింది. ఈ ఆలయంలో పాటలీ వృక్షం ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రతి దీపావళికి నరకసురుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. కార్తీక మాసంలో భక్తులు ఇక్కడి నదిలో స్నానమాచరించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు.
Sorry, no posts matched your criteria.