India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలోని హీల్ పారడైజ్ పాఠశాల ఆవరణలో శిక్షణ పొందుతున్న ఉండి మండలం ఇనకుదురు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం టీవీ. రత్నకుమార్ గుండెపోటుతో బుధవారం మృతిచెందాడు. 3 రోజులుగా హెచ్ఎంలకు శిక్షణ ఇస్తుండగా, రత్నకుమార్ హఠాత్తుగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం రత్నకుమార్ మృతిపట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు.
కోడూరు శివారు నరసింహపురం ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వేణుగోపాలరావును విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈవో రామారావు ఉత్తర్వులు జారీ చేసినట్లు కోడూరు ఎంఈఓ రామదాసు తెలిపారు. తమ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించి తొడపై కొరికాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటనపై విచారించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
నూజివీడు త్రిపుల్ ఐటీలో యువతరం కార్యక్రమం పేరిట సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, లలిత కళలు అనే ఐదు విభాగాల నుంచి 25 అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటి 8, శ్రీకాకుళం 6, ఇడుపులపాయ 5, ఒంగోలు త్రిపుల్ ఐటీలు 4 స్థానాల్లో అర్హత సాధించాయి. ఈ పోటీల్లో ఎంపికైన వారు వచ్చే నెల 26 నుంచి 30 వరకు కాంచీపురంలో నిర్వహించే సౌత్ జోన్ పోటీల్లో ఆర్జీయూకేటీ తరఫున పాల్గొననున్నారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం ఈనెల 7కి వాయిదా వేసింది. విద్యాసాగర్‌ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విద్యాసాగర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. గతంలో ప్రకటించిన గడువు ప్రకారం అపరాధ రుసుము లేకుండా అక్టోబరు 28కి ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ గడువును ఈ నెల 18 వరకు పెంచుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదేశాలు జారీచేశారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు రూ.200 అపరాధ రుసుముతో చెల్లించవచ్చు అన్నారు.
కోడూరు మండలంలో కీచక టీచర్ మూడో తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుచున్నారు. బాలికపై జరిగిన ఈ దారుణం పాప తమకు చెప్పడానికే భయపడిందని, అంతలా భయపెట్టాడని వాపోయారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో టీచర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత ఐదు నెలల్లో కోడూరు మండలంలో ఇలాంటి ఘటనలు నాలుగు చోటు చేసుకోవడం, ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్ కావడం గమనార్హం.
ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని సరిధే భూమికశ్రీ కోరారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్‌కు చెందిన తాను అదే ప్రాంతానికి చెందిన పెనుమచ్చల హరిప్రసాద్‌తో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న తమ తల్లిదండ్రులు చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.
మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సుభాష్ వాసంశెట్టితో సోమవారం కలెక్టర్ DK బాలాజీ, ఎస్పీ ఆర్.గంగాధర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మచిలీపట్నం ఆర్అండ్‌బీ అతిథిగృహంలో ఈ భేటీ జరిగింది. ఈ మేరకు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పలు పథకాలు, కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి కలెక్టర్ DK బాలాజీ, మంత్రి సుభాష్‌కు వివరించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ బాస్కెట్‌బాల్ అండర్ 14 రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి జట్టుపై తలపడి ఓటమిపాలైంది. అయితే కృష్ణాజిల్లా జట్టు నుంచి కుసుమ, ఆర్ వాహినిలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ వాకా నాగరాజు తెలిపారు.
విజయవాడ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆదివారం పోలీసులు 45 కేసులు నమోదు చేశారు. చింతాప్రదీప్ రెడ్డి దర్శన్ పిఠాపురం పావలా ఏకే ఫ్యాన్ అనే సోషల్ మీడియా ఎకౌంట్లపై జనసేన, టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాచవరం గుణదల పోలీస్ స్టేషన్లో వీరి అకౌంట్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.