Krishna

News October 31, 2024

ఉచిత ఇసుక అమలుకు పటిష్ట చర్యలు: కృష్ణా కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానం ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

News October 31, 2024

ఏడాదికి రూ.2,684 కోట్ల ఖర్చు: మంత్రి కొలుసు

image

రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 2,684 కోట్ల ఖర్చు చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక కింద ఈ పథకం అందించారన్నారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 సిలిండర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం అందజేస్తోందని కొలుసు ఈ మేరకు ట్వీట్ చేశారు.

News October 30, 2024

దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), అంబాలా(UMB) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06098 UMB-MAS ట్రైన్‌ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 వరకు ప్రతి బుధవారం, నం.06097 MAS-UMB ట్రైన్‌ నవంబర్ 4,11 తేదీలలో నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, గూడూరులో ఆగుతాయన్నారు. 

News October 30, 2024

కృష్ణా: LLB 9వ సెమిస్టర్ టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు. 

News October 30, 2024

కృష్ణా యూనివర్సిటీలో ఎంటెక్ స్పాట్ అడ్మిషన్లు

image

కృష్ణా యూనివర్సిటీలో ఎంటెక్(CSE) కోర్సులో 2024-25 విద్యా సంవత్సరానికిగాను 11 సీట్లను స్పాట్ అడ్మిషన్ ప్రాతిపదికన అర్హులైన విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ సీట్లకు ఏటా రూ.50 వేలు ఫీజుగా నిర్ధారించినట్లు యూనివర్సిటీ డైరెక్టరేట్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకై https://kru.ac.in/ విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. 

News October 30, 2024

ఉచిత ఇసుకపై YCP పోస్ట్‌.. స్పందించిన మంత్రి కొలుసు

image

నూజివీడులో కూటమి ప్రభుత్వం బరితెగించిందని YCP పెట్టిన పోస్టుపై మంత్రి కొలుసు పార్థసారథి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘అబద్ధాలను ప్రచారం చేయడంలో YCP దిట్ట అని చెప్పవచ్చన్నారు. ఎవరో తెలియక తమ వ్యాపారం కోసం పెట్టుకున్న బోర్డులను TDP, రాష్ర్ట ప్రభుత్వానికి ఆపాదించడం ఎంత వరకు సమంజసమన్నారు. YCP హయాంలో ఇసుక దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ సంగతి మరిచిపోయారా’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

News October 30, 2024

బాలికను పెళ్లి చేసుకుని వేధిస్తున్న భర్త.. పోక్సో కేసు నమోదు

image

విజయవాడలో ఓ మైనర్ బాలికను వేధించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడలో ఉంటున్న 9వ తరగతి విద్యార్థిని(14)పై మేనమామ వరసైన సూరిబాబు మాయమాటలతో 2022లో అత్యాచారం చేయడంతో, పెద్దలు పెళ్లి చేశారు. 2ఏళ్లు గడవకముందే అత్తమామలు, భర్త వేధించడంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. బాలికకు 16ఏళ్లు కావడంతో గుణదల పోలీసులు పోక్సో, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News October 30, 2024

నూజివీడులో కూటమి ప్రభుత్వం బరితెగించింది: YCP

image

‘నూజివీడులో కూటమి ప్రభుత్వం బరితెగించిందని, ఇసుక స్మగ్లింగ్ చేయబడునని అక్రమంగా తరలించి మీకు ఇవ్వబడును అంటూ ఏకంగా ఫ్లెక్సీలు కట్టారని వైసీపీ విమర్శించింది. ప్రభుత్వ అధీనంలోని ఇసుక ప్రైవేటు వ్యక్తులు ఎలా అమ్ముతారు.. దీనికి ప్రభుత్వం వత్తాసా ? అంటే తమ నాయకులు ఏం చేసినా ఫర్వాలేదా..? ఇదేనా మీరు చెప్పుకుంటున్న మంచి ప్రభుత్వం? అని ట్వీట్ చేసింది.

News October 30, 2024

రౌడీషీటర్లపై నిఘా పెట్టండి: కృష్ణా ఎస్పీ 

image

రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధరరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ అధ్యక్షతన మంగళవారం జిల్లా నేర సమీక్షా సమావేశం జరగ్గా నేరాల నియంత్రణపై సమీక్షించారు. జైలు నుంచి విడుదలైన నేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టిసారించాలన్నారు.

News October 29, 2024

విజయవాడలో మహిళా డాన్సర్ మృతి

image

విజయవాడ సింగ్ నగర్‌లో మహిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె డాన్సర్ వెంకటలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. ఆమె స్వస్థలం కాకినాడ కాగా, సింగినగర్‌కు వచ్చి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో స్థానికులు హత్యగా భావించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అజిత్ సింగ్ నగర్ సీఐ వెంకటేశ్వరా నాయక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!