India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA & MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుండి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుండి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 7లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
విజయవాడ మెట్రో ప్రాజెక్టు పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విజయవాడ మెట్రో నిర్మాణానికి రూ.25,130కోట్లు కావాలని వాటిని కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలని ప్రతిపాదనలు పెట్టనుంది. కాగా విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల నిమిత్తం రూ.42,362కోట్లు ఇవ్వాలని.. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
తాళం వేసి ఉన్న ఇంటికి సీసీ కెమెరాలు అమర్చి నిరంతర పోలీసుల పర్యవేక్షణలో ఉండేలా రూపొందించిన “లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం(LHMS)”పై విజయవాడ పోలీసులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సదుపాయం పొందేందుకు LHMS AP Police యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని, వివరాలకు 9440906878 నంబరుకు కాల్ చేయాలని వారు కోరారు. ఈ సేవలలో భాగంగా తాళం వేసి ఉన్న గృహాల భద్రతకై పోలీసులు ఉచితంగా నిఘా కెమెరాను అమర్చుతారన్నారు.
నాగాయలంక మండలం ఈ కొత్తపాలెం గ్రామంలో మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఓ ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనివ్వడం గ్రామ ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేసింది. కాగా ఈ వింత ఘటన చూడడానికి గ్రామ ప్రజలు బారులు తీరారు. యజమాని మాట్లాడుతూ.. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు.
ప్రయాణికుల సౌలభ్యం మేరకు విశాఖ-విజయవాడ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08567 విశాఖ-విజయవాడ, నం.08568 విజయవాడ-విశాఖ రైళ్లను ఈ నెల 1,3,4,6,8,10,11,13 తేదీలలో 2 వైపులా నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో 10 జనరల్ సెకండ్ క్లాస్, 1 సెకండ్ క్లాస్ కం దివ్యాంగుల కోచ్‌లు ఉంటాయన్నారు. ఉమ్మడి జిల్లాలో విజయవాడతో పాటు గన్నవరంలో ఈ రైళ్లు ఆగుతాయి.
కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ (Y20,Y21 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 25 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని కోరింది.
ప్రయాణికుల రద్దీ మేరకు రాయనపాడు మీదుగా సికింద్రాబాద్(SC), సత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 1,8, 15 తేదీలలో SRC- SC(నం.08845), నవంబర్ 2, 9,16 తేదీలలో SC- SRC(నం.08846) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడలో ఆగవని సమీపంలోని రాయనపాడు స్టేషన్‌లో ఆగుతాయన్నారు.
ప్రయాణికుల రద్దీ మేరకు రాయనపాడు మీదుగా సికింద్రాబాద్(SC), సత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 1,8, 15 తేదీలలో SRC- SC(నెం.08845), నవంబర్ 2, 9,16 తేదీలలో SC- SRC(నెం.08846) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడలో ఆగవని సమీపంలోని రాయనపాడు స్టేషన్‌లో ఆగుతాయన్నారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,70,210 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక డాష్‌బోర్డు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,31,961 మందికి రూ.97,93,900,00, కృష్ణా జిల్లాలో 2,38,249 మందికి రూ.1,01,09,08,500 నవంబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
జి.కొండూరు మండలం ఆత్కూర్ క్రాస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బొలెరో ట్రక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారు సాయి, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ఎస్ఐ సతీశ్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో మరో 10మందికి గాయాలైనట్లు చెప్పారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.