Krishna

News July 11, 2024

విజయవాడ: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం

image

విజయవాడ వన్ టౌన్ విజయ కాంప్లెక్సులోని ఫ్యాన్సీ వస్తువుల గోడౌన్లలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మూడు గోడౌన్లు మంటలకు ఆహుతయ్యాయని వ్యాపారస్తులు తెలిపారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల ఆస్తి అగ్నికి ఆహుతైనట్లు భావిస్తున్నారు.

News July 11, 2024

కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో గురువారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న గుంటూరు, బాపట్ల జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.

News July 11, 2024

బందరు పోర్టు పురోగతిపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్

image

బందరు పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రతివారం ప్రగతి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పోర్టు, జలజీవన్ మిషన్ కింద జరుగుతున్న పనులపై బుధవారం ఆయన సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. రోడ్ కం రైల్ కనెక్టివిటీకి సంబంధించి భూసేకరణపై దృష్టిసారించాలన్నారు.

News July 10, 2024

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

image

విజయవాడ వన్ టౌన్ మెయిన్‌రోడ్‌లో విజయా కాంప్లెక్స్‌లోని కృష్ణ బ్యాంగిల్స్ షాప్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫ్యాన్సీ సామగ్రి, పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణ బ్యాంగిల్స్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

News July 10, 2024

కృష్ణా: రేపు త్రిబుల్ ఐటీ అభ్యర్థుల జాబితా విడుదల

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలకు సంబంధించిన అడ్మిషన్లలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈనెల 11న ఉదయం 11 గంటలకు ఛాన్సలర్ ఆచార్య కేసిరెడ్డి విడుదల చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ వర్గాలు తెలిపాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.

News July 10, 2024

హజ్ యాత్రికులకు ఘనస్వాగతం పలికిన మంత్రి ఫరూక్

image

హజ్ యాత్రను ముగించుకొని ఏపీకి తిరిగొచ్చిన యాత్రికులకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ బుధవారం ఘనస్వాగతం పలికారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి లభించిన సహాయ సౌకర్యాలతో హజ్ యాత్ర ముగించుకుని స్వస్థలాలకు చేరుకున్నామని, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని యాత్రికులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

News July 10, 2024

ఎన్టీఆర్: జగన్ పాలనలో వ్యవస్థలు కుదేలు- మాజీ మంత్రి

image

జగన్ విధ్వంస పాలనలో వ్యవస్థలు కుదేలయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అన్నివిధాలుగా గాడిలో పెట్టే పని మొదలుపెట్టారని ఉమ వ్యాఖ్యానించారు. సంపద సృష్టి ద్వారా టీడీపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు చేపడుతోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News July 10, 2024

కృష్ణా: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన APSSDC

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆన్‌లైన్‌లో సేల్స్ ఫోర్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జూలై 15 నుంచి 30 వరకు రోజుకు 2 గంటలపాటు ఇస్తామని APSSDC పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబరులో సంప్రదించాలని, అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News July 10, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు వన్ వే స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం- నాగర్‌సోల్(నం.07169) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ జులై 15న మధ్యాహ్నం 12.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి 16వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News July 10, 2024

జగ్గయ్యపేట ఘటన.. రెండుకు చేరిన మృతుల సంఖ్య

image

మండలంలోని బుధవాడ సిమెంటు కర్మాగారంలో బాయిలర్ పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గత నాలుగు రోజుల నుంచి విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బానోతు స్వామి మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు.