India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి శ్రీకాకుళానికి ప్రతి రోజూ ఇంద్ర AC బస్సు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రి 8.40 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుందని, తిరుగుప్రయాణంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా దానాపూర్(DNR)-SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 3న నం.06235 SMVB-DNR రైలును, నవంబర్ 9న నం.06236 దానాపూర్-SMVT బెంగుళూరు రైలును నడుపుతామని ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
బాలికపై అత్యాచారం చేసిన ఓ బాలుడిపై కంకిపాడు పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది. ఎస్ఐ సందీప్ వివరాల మేరకు.. మండలంలోని ఓ కాలేజీలో బాలిక కడపకు చెందిన బాలుడు ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ క్రమంలో బాలికను ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తండ్రికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
చల్లపల్లి బీసీ వసతి గృహంలో 2019 ఆగస్టులో జరిగిన విద్యార్థి హత్య కేసుకు సంబంధించి శుక్రవారం తీర్పు వెలువడింది. ఆదిత్య అనే బాలుడిని సహ మైనర్ విద్యార్థి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ముద్దాయికి విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ మూడేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ముద్దాయిని విశాఖపట్నం స్పెషల్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 7లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 24తో ఫీజు చెల్లింపు గడువు ముగియగా నవంబర్ 7 వరకు ఫీజు చెల్లించేలా నోటిఫికేషన్ విడుదల చేశామన్నాయి.
నాగాయలంక: గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు కావడంతో కృష్ణా జిల్లాలో అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాగాయలంకలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రధాని మోదీకి ఆయన ఈ మేరకు Xలో ధన్యవాదాలు తెలిపారు.
డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి షాహిద్ బాబు షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25తో దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో మరో రెండు రోజులకు గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుపేద SC, ST అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘ఆరేళ్లుగా కోడి కత్తి కేసులో ఎందుకు సాక్ష్యం చెప్పలేదు? అధికారం కోసం ఆడిన రాజకీయ డ్రామాతో ఒక దళితుడిని బలిచేశారు. అబద్ధాలు, అసత్యాలతో రాజకీయ లబ్ధి పొందారు. ఐదున్నరేళ్లుగా జైలులో మగ్గినా పట్టించుకోలేదు. సాక్ష్యం చెప్పమని నిరాహార దీక్ష చేసిన కుటుంబాన్ని హింసించారు’ అని శుక్రవారం ట్వీట్ చేశారు.
కృష్ణా జిల్లాలో YCP కీలక నేతలు పార్టీకి దూరం అవుతున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలుగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్, రక్షణనిధి.. ఎన్నికల అనంతరం కేశినేని నాని పార్టీని వీడారు. ఇటీవల సామినేని ఉదయభాను, వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సామినేని జనసేనలో చేరగా, వాసిరెడ్డి పద్మ రాజకీయ పయనంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో జిల్లాలో వైసీపీని బలపరిచేందుకు అధినేత జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
19ఏళ్ల అబ్బాయి, 18ఏళ్ల అమ్మాయి పెళ్లి చేసుకున్న ఘటన పెడనలో జరిగింది. గురువారం మండలంలోని నందిగామకు చెందిన ప్రేమికులు పెళ్లి చేసుకొని పెడన పోలీస్ స్టేషనుకు చేరుకున్నారు. చట్ట ప్రకారం వరుడికి 21 సం.లు ఉండవలసి ఉండగా 19 సం.లు కావడంతో పోలీసులు అంగీకరించలేదు. అమ్మాయి డిగ్రీ ఫస్టియర్ చదువుతుండగా, అతను ఇంటరుతో ఆపివేసినట్లు తెలిసింది. ఎస్ఐ ఇరువురు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.