Krishna

News July 9, 2024

శభాష్.. ధీరజ్: నారా లోకేశ్

image

పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విజయవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘బొమ్మదేవర ధీరజ్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రికర్వ్ ఆర్చర్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల ఆసియా టోర్నీలో రజతంతో మెరిసిన 22 ఏళ్ల ధీరజ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

News July 9, 2024

ఉచిత డీఎస్సీ శిక్షణ 18 నుంచే: కొలికపూడి

image

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 18 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని తాజాగా ఎమ్మెల్యే తెలిపారు. తిరువూరు లక్ష్మీపురం అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎవరైనా ఈ ఉచిత డీఎస్సీ శిక్షణ కోసం రావొచ్చని స్పష్టం చేశారు.

News July 9, 2024

విజయవాడ డివిజన్‌లో రద్దయిన రైళ్లు ఇవే

image

విజయవాడ, గూడూరు సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దైన రైళ్లు..
★ 07500 విజయవాడ-గూడూరు (ఈ నెల 15 నుంచి 30 వరకు)
★ 07458 గూడూరు-విజయవాడ (16 నుంచి 31 వరకు)
★ 07461 విజయవాడ-ఒంగోలు 16 నుంచి 30 వరకు)
★ 07576 ఒంగోలు-విజయవాడ 16 నుంచి 30 వరకు)
★ 12743/12744 విజయవాడ-గూడూరు (15 నుంచి 30 వరకు)
★ 17259/17260 గూడూరు-విజయవాడ (16, 23, 24, 30 తేదీల్లో)

News July 9, 2024

విజయవాడ పటమట వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై సోమవారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. సీఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పటమటలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. నిర్వాహకుడు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఐదుగురు మహిళలను రక్షించి కేసు నమోదు చేశామన్నారు.

News July 9, 2024

కృష్ణా: స్టాప్ డయేరియా క్యాంపైన్ నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

image

సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపైన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సోమవారం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమావేశమైన ఆయన స్టాప్ డయేరియా క్యాంపైన్ నిర్వహణ తీరుపట్ల సమీక్షించారు. మున్సిపాలిటీల్లోని వార్డు సచివాలయం ఎమినిటీస్ సెక్రటరీల పరిధిలోని పైపులైనుల తనిఖీపై సమీక్షించారు.

News July 8, 2024

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ షర్మిల

image

కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి కుటుంబ సమేతంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడకు వెళ్లారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

News July 8, 2024

కృష్ణా: కైకలూరులో మాజీ ఎమ్మెల్యేపై ఫ్లెక్సీల కలకలం

image

కైకలూరు మాజీ MLA దూలం నాగేశ్వరరావు 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు అంటూ.. మంగళవారం పలుచోట్ల ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నాగేశ్వరావు ఐదేళ్ల పాలనలో అనేక అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు చేశారంటూ పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ప్లెక్సీ ఏర్పటు చేశారు. ఎమ్మెల్యే బాధితుల సంఘం అధ్యక్షుడు అంటూ వరప్రసాద్(బాబి) పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

News July 8, 2024

విజయవాడ: ఆర్‌ఐని సస్పెండ్ చేసిన సీపీ

image

పోలీసు సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్న ఆర్‌ఐ శ్రీనివాసరావును విజయవాడ కమిషనర్ రామకృష్ణ ఆదివారం సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు తన క్రింది మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు.

News July 8, 2024

జగ్గయ్యపేట: సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం.. ఐదుగురిని కాపాడిన యువకుడు

image

జగ్గయ్యపేటలోని ఓ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన హేమంత్ కుమార్ ఐదుగురి ప్రాణాలు కాపాడారు. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం సమయంలో 4వ అంతస్తులో పనిచేస్తున్నాని, కంగారులో పై అంతస్తులోని వారు కిందకు దిగుతుంటే వేడి తగ్గేవరకు ఇక్కడే ఉండాలని వారిని నిలువరించానన్నారు. కంగారులో కొందరు కిందకు వెళ్లడంతో వేడి సిమెంట్ ధూళి పడి గాయపడ్డారని చెప్పాడు.

News July 8, 2024

విజ‌య‌వాడ‌: ముగిసిన UPSC EPFO, ESICప‌రీక్ష‌లు

image

విజ‌య‌వాడ‌లో ఆదివారం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన EPFO ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, ESIC న‌ర్సింగ్ ఆఫీస‌ర్ ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు. EPFO ప‌రీక్ష‌కు సంబంధించి 2,401 మందికి, ESIC ప‌రీక్ష‌కు 5,433 మంది అభ్య‌ర్థులకు విజయవాడలో ఏర్పాటు చేసిన 25 ప‌రీక్షా కేంద్రాలను క‌లెక్ట‌ర్ సృజ‌న పరిశీలించారు.