India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి భార్యాభర్తలు మృతి చెందారు. కొండ ప్రశాంతి, రాంబాబు భార్యాభర్తలు. ఎప్పటిలాగానే పశువులను మేత కోసం తోలుకు వెళ్లారు. పశువులు చెరువులోకి వెళ్లడంతో, వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సనత్‌నగర్(SNF), సత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 30, నవంబర్ 6 తేదీల్లో SNF- SRC(నం.07069), అక్టోబర్ 31, నవంబర్ 7 తేదీల్లో SRC- SNF(నం.07070) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సంవత్సరం ఇంజినీరింగ్ విద్యలో 20శాతం పైగా సీట్లు మిగిలిపోయాయి. ఎప్పుడు ఇంజినీరింగ్ సీట్లు దాదాపు 90 శాతంపైగా పూర్తి అయ్యేవి. నూతనంగా డీగ్రీలో కొన్ని కొత్త కోర్సులు రావడంతో ఇంజినీరింగ్‌లో వారు కోరుకున్న సీటు రాకపోవడంతో అటు వెళ్తున్నారని విద్య నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఉద్యోగాలకు వెళ్లడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ (Y20 నుంచి Y23 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. DEC 6 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరింది.
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి శ్రీకాకుళానికి ప్రతి రోజూ ఇంద్ర AC బస్సు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రి 8.40 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుందని, తిరుగుప్రయాణంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా దానాపూర్(DNR)-SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 3న నం.06235 SMVB-DNR రైలును, నవంబర్ 9న నం.06236 దానాపూర్-SMVT బెంగుళూరు రైలును నడుపుతామని ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
బాలికపై అత్యాచారం చేసిన ఓ బాలుడిపై కంకిపాడు పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది. ఎస్ఐ సందీప్ వివరాల మేరకు.. మండలంలోని ఓ కాలేజీలో బాలిక కడపకు చెందిన బాలుడు ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ క్రమంలో బాలికను ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తండ్రికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
చల్లపల్లి బీసీ వసతి గృహంలో 2019 ఆగస్టులో జరిగిన విద్యార్థి హత్య కేసుకు సంబంధించి శుక్రవారం తీర్పు వెలువడింది. ఆదిత్య అనే బాలుడిని సహ మైనర్ విద్యార్థి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ముద్దాయికి విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ మూడేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ముద్దాయిని విశాఖపట్నం స్పెషల్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 7లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 24తో ఫీజు చెల్లింపు గడువు ముగియగా నవంబర్ 7 వరకు ఫీజు చెల్లించేలా నోటిఫికేషన్ విడుదల చేశామన్నాయి.
నాగాయలంక: గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు కావడంతో కృష్ణా జిల్లాలో అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాగాయలంకలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రధాని మోదీకి ఆయన ఈ మేరకు Xలో ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.