India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డ్రోన్ సమ్మిట్‌లో నిర్వహిస్తోన్న హ్యాకథాన్ విజేతలకు మొత్తంగా రూ.24లక్షల ప్రైజ్ మనీని అమరావతి డ్రోన్ సమ్మిట్ ఇవ్వనుంది. మొత్తం 4 కేటగిరీలలో ఈ పోటీలు నిర్వహిస్తుండగా, ప్రతి కేటగిరిలో మొదటి బహుమతిగా రూ.3లక్షలు, సెకండ్, థర్డ్ ప్రైజ్‌గా రూ.2, రూ.1లక్షను ఇవ్వనున్నట్లు డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ దినేశ్ చెప్పారు. విజేతలను ఎంపిక చేసే జ్యూరీలో పలు ఐఐటీలు, కేంద్ర పౌర విమానశాఖ ప్రతినిధులు ఉంటారన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జూలై 2024లో నిర్వహించిన LLB కోర్సు 4వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 29లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి టాలీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. కానూరులోని ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్‌లో అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ట్రైనింగ్ సెంటర్‌లో సంప్రదించాలన్నారు. ఈ శిక్షణకు బీకామ్, బీఎ, బీబీఏ, ఎమ్‌కామ్ పూర్తి చేసిన 18- 30 సంవత్సరాల అభ్యర్థులు అర్హులన్నారు.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఈ మేరకు టైంటేబుల్‌ను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి విజయవాడలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. నవంబర్ 4,5,6,7 తేదీలలో ఉదయం 9- 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, 2023- 25 బ్యాచ్‌తో పాటు 2022- 24, 2021- 23లలో ఫెయిలైనవారు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుందని దేవానందరెడ్డి తెలిపారు.
మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టినందుకు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశప్రజలలో స్ఫూర్తి నింపేలా జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారని పవన్ వ్యాఖ్యానించారు. అలాంటి మహనీయుడి పేరు మచిలీపట్నం వైద్య కళాశాలకు పెట్టడం హర్షణీయమన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(2021, 22, 23 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను నవంబర్ 26 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 1లోపు ఏ అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా నేడు సోమవారం 48 విమాన సర్వీసులు ప్రయాణించాయని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 24 సర్వీసుల ద్వారా 2094 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 2211 మంది 24 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా విమాన సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామని పేర్కొంది.
మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెడుతూ.. కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీకి దివంగత వైఎస్ఆర్ పేరు పెట్టగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ దీన్ని వ్యతిరేకించింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి వినతి మేరకు మెడికల్ కాలేజీకి పింగళి పేరు పెడతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కృష్ణా జిల్లాలోని అర్బన్ PHCలలో కాంట్రాక్ట్ పద్ధతిన 20 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రేపు సాయంత్రం 5 గంటలలోపు మచిలీపట్నంలోని DMHO కార్యాలయంలో దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల విద్యార్హతల వివరాలు, దరఖాస్తు నమూనాకు అభ్యర్థులు https://krishna.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో RECRUITMENT ట్యాబ్ చూడవచ్చు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో B.B.A. కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 70 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలు నవంబర్ 7, 8, 9, 10, 11, 12 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వర్సిటీ పరిధిలోని పలు కేంద్రాలలో జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.