India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తమ అధికారిక ఖాతాలో సోమవారం ట్వీట్ చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్టోబర్ 22 నుంచి 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని APSDMA సూచించింది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్(Y19 నుంచి Y22 బ్యాచ్లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 1లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
ANUలోని సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ (వాటర్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల విభాగం సంచాలకులు బ్రహ్మాజీ తెలిపారు. పరిమిత సీట్లు ఉన్నాయని, ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బీఎస్సీ, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.20వేలు ఫీజు చెల్లించి కోర్సులో చేరాలన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డిస్టెన్స్) పరిధిలో బీఏ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 7, 8, 9, 10, 11, 12, 13,14, 15, 16 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యూనివర్సిటీ పరిధిలోని పలు కేంద్రాలలో జరుగుతాయని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్సోల్ (17231) ప్రయాణించే రైలు సమయాల్లో ఎలాంటి మార్పులు చేయట్లేదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆదివారం ట్వీట్ చేసింది. కాగా నిన్న ఈ ట్రైన్ ప్రయాణించే సమయాల్లోమార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది.
కృష్ణా జిల్లాలో రాత్రి సమయాల్లో పకడ్బందీగా పోలీస్ గస్తీ విధులు నిర్వహిస్తున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో ఆదివారం ట్వీట్ చేసింది. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బీట్ పాయింట్స్ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారని పేర్కొంది. వ్యాపార సముదాయాలు, ప్రధాన రహదారుల వద్ద పహారా కాస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.
కృష్ణా జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలంలోని మాదలవారిగూడెంకు చెందిన ఓ కాలేజీ విద్యార్థులు ఆదివారం కావడంతో స్నానానికి వెళ్లారు. క్వారీ గుంతలో ఏడుగురు ఈతకు వెళ్లగా.. సెల్ఫీలు తీసుకుంటూ అందరూ గల్లంతయ్యారు. వారిలో దుర్గాప్రసాద్, వెంకటేశ్ అనే విద్యార్థులు మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి కేసు నమోదు చేశారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి బొమ్మల కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బొమ్మల తయారీకి అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారిన నేపథ్యంలో వాటికై వినియోగించే అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ చెట్లు పెంచాలని పవన్ అధికారులను ఆదేశించారని జనసేన తమ అధికారిక x ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీకామ్ జనరల్&కంప్యూటర్ అప్లికేషన్స్) చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 7, 8,9,10,11,12 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీకామ్ జనరల్&కంప్యూటర్ అప్లికేషన్స్) చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 7, 8,9,10,11,12 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.