India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా లెక్టర్ బాలాజీ శుక్రవారం మచిలీపట్నంలోని తన కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో సింగల్ డెస్క్ పాలసీ కింద 80 దరఖాస్తులు రాగా వాటిలో 52 దరఖాస్తులకు అనుమతులు రావడంతో వాటిని ఆమోదిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 28 దరఖాస్తులకు సంబంధించి 6 ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను పరిశీలించాలని కోరారు.
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం, కృష్ణా నదీ వద్ద పవిత్ర స్నానాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర సముద్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. వేకువజాము నుంచే నదిలో భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు పవిత్ర స్నానం ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం భక్తులు పాత శివాలయానికి వెళ్లారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు, విజయవాడ మీదగా సికింద్రాబాద్, లక్నో మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15, 22 తేదీలలో (నం.07084) సికింద్రాబాద్ నుంచి రాత్రి 7:50కి బయలుదేరి లక్నోకు ఆదివారం రాత్రి 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 18, 25 తేదీలలో (నం.07083) సోమవారం ఉదయం 9:50కి లక్నోలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “దేవర” సినిమా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 4 థియేటర్లలో ఫిఫ్టీ డేస్ పూర్తి చేసుకుంది. మొత్తంగా 52 సెంటర్లలో ఈ చిత్రం 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుందని చిత్రబృందం గురువారం ట్వీట్ చేసింది. కాగా ఉమ్మడి జిల్లాలోని మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, ఉయ్యూరు సెంటర్లలో “దేవర” విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఉదయం 5గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభిస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి విశేష సేవలు అందించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశం కోసం నిస్వార్ధంగా సేవలు అందించిన ఏకైక కుటుంబం గాంధీ కుటుంబం అని అన్నారు.
కంచికచర్ల మండల పరిధిలోని కీసర జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి నందిగామ వైపు వెళుతున్న బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. బొలెరో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, అతణ్ని ప్రభుత్వ ఆస్పత్రి తరలించి చికిత్స అందించారు. బండిలోని సరుకు రోడ్డుపై పడటంతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB & BA.LLB కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. ప్రతీ సెమిస్టర్‌లో 90 పని దినాలు, ప్రణాళికాబద్ధంగా పరీక్షలు జరిగేలా క్యాలెండర్‌ను రూపొందించామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC), లక్నో(LKO) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు నవంబర్ 15, 22 తేదీలలో SC- LKO(నం.07084), నవంబర్ 18, 25 తేదీలలో LKO-SC(నం.07083) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాలలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దివంగత భారత ప్రధాని పండిట్ నెహ్రు జన్మదినమైన ఈ రోజు ఆయనను స్మరించుకోవాలన్నారు. పిల్లలే దేశ భవిష్యత్ అని, ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలని గవర్నర్ స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.