India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా సామినేని ఉదయభాను నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆయన.. జనసేన అధినేత పవన్ సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో సామినేని ఉదయభాను జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో జరగనున్న డిగ్రీ, పీజీ 1,3వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 17 నుంచి 26 వరకు జరగాల్సిన ఈ పరీక్షలను వచ్చే నెల 17 నుంచి 26కు వాయిదా వేశామని పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 17 నుంచి 26 వరకు జరగాల్సిన పరీక్షలను నవంబర్ నెలలో అవే తేదీలలో నిర్వహించనున్నట్లు టెంటేటివ్ షెడ్యూల్ విడుదల చేసింది.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే వన్ స్టాప్ సెంటర్‌లో 4 ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్(1), సోషల్ కౌన్సిలర్(1), సెక్యూరిటీ గార్డ్(2) ఉద్యోగాలకు 18- 42 సం.లలోపు వయస్సున్న అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు అటెస్ట్ చేయించి కానూరులోని కార్మెల్ చర్చి ఎదురు రోడ్‌లో ఉన్న శిశుసంక్షేమ అధికారి కార్యాలయంలో అందజేయాలి.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y23 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, ఓపెన్ & డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ఇటీవల ఈ గడువు ముగియగా, ఈ నెల 31 వరకు గడువు పొడిగించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. అడ్మిషన్ల వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.
హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జూన్ 1-అక్టోబర్ 15 మధ్య ఇసుక తవ్వకాల్ని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో నేటి నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది. ఎగువ నుంచి కృష్ణా, గోదావరి నదులలో వరద తగ్గగానే దాదాపు 60 ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని సమాచారం.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీ.ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(Y17 నుంచి Y22 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ట్వీట్ చేసింది. సముద్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వాయుగుండం రేపు తెల్లవారు జామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూర విద్యాకేంద్రంలో ఈ నెల 17 నుంచి యూజీ, పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం పేర్కొన్నారు. మంగళవారం పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండెంట్లతో రిజిస్ట్రార్ సమావేశమయ్యారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గతంలో మాదిరిగా అక్రమాలు జరిగితే ఉపేక్షించబోమని చెప్పారు. పరీక్షల నిర్వహణలో సూపరింటెండెంట్లు కీలకమన్నారు.
డిప్యూటీ CM పవన్ ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి కాలుష్య సమస్య పరిష్కారానికి అధికారులు నడుం బిగించారు. తాగునీటి నమూనాల సేకరణకు 44మంది ఇంజినీరింగ్ సహాయకులతో 6 బృందాలను ఏర్పాటు చేయగా ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి నీటి నమూనాలు సేకరిస్తున్నాయి. 43 గ్రామాల్లో తాగునీరు కలుషితమైందని MLA వెనిగండ్ల రాము కంకిపాడులో జరిగిన పల్లె పండుగ సభలో పవన్ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.