India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు విధులలో ఉన్నందున ఈ నెల14వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సృజన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ చెప్పారు.
దసరా పండుగ అనగానే అందరికీ పల్లెటూరు గుర్తుకు వచ్చేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులు కలిసి ఊరంతా సంతోషంగా తిరుగుతూ ఉంటారు. ఊరిలో అందరినీ పలకరిస్తూ.. ఉంటే ఆ ఆనందం మాట్లల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఊరితో ఒక్కో విధంగా పండుగను జరుపుకుంటారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం, అధైర్యంపై ధైర్యం, చెడుపై మంచి విజయం సాధించిన రోజైన విజయదశమి పర్వదినం విజయానికి సంకేతంగా నిలిచిందని కొల్లు పేర్కొన్నారు. దుర్గా మాత కరుణతో ఈ దసరా పర్వదినం అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నానన్నారు.
కనకదుర్గమ్మ అమ్మవారు శనివారం విజయ దశమి రోజున రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుందని పండితులు తెలిపారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా తనను కొలిచిన భక్తులకు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహిస్తుందన్నారు. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి రాజేశ్వరి దేవి అధిష్టాన దేవత అని పండితులు చెబుతారు.
ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 113 మద్యం షాపుల కోసం 5,787 అప్లికేషన్లు వచ్చాయి. జిల్లాలోని ప్రతి షాపునకు సగటున 51 దరఖాస్తులు దాఖలైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. ఈ నెల 12,13వ తేదీల్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం 14వ తేదీన జిల్లా అధికారుల సమక్షంలో డ్రా తీసి మద్యం షాపులను కేటాయించనున్నట్లు అధికారులు చెప్పారు.
దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ఈ నెల 17 వరకు పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 12,14,15,16,17 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 12,13,15,16,17 తేదీల్లో CHE-BZA(నం.07216) రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.
విశాఖపట్నం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఈ నెల 27 నుంచి ఈ నగరాల మధ్య అదనపు విమాన సర్వీసును అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ నుంచి విజయవాడకు నేరుగా ఒక విమానం మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సంబల్‌పూర్(SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం SBP-ED(నం.08311), నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం ED-SPB(నం.08312) మధ్య నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
కొరియర్ పేరిట మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై స్పందించవద్దని ఎన్టీఆర్ జిల్లా ప్రజలను పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద పార్సిల్ వచ్చిందంటూ సైబర్ నేరగాళ్లు..ప్రజల బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. ఈ విధమైన ఫోన్ కాల్స్ ప్రభావానికి గురి కావొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలని కోరింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1,3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.