Krishna

News October 11, 2024

ప్రభుత్వ జోక్యంతో ధరలు అదుపులోకి వచ్చాయి: మంత్రి కొల్లు

image

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లి, టమాటో అందిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ట్వీట్ చేశారు. అన్ని రైతుబజార్లలో సబ్సిడీపై కిలో టమాటో రూ.40, కిలో ఉల్లి రూ.35కి అందజేస్తున్నామని కొల్లు తెలిపారు. అధిక ధరలకు ప్రభుత్వం కూరగాయలు అమ్ముతోందన్న ప్రచారం అవాస్తవమని, ప్రభుత్వ జోక్యంతో ఉల్లి, టమాటో ధరలు అదుపులోకి వచ్చాయని కొల్లు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News October 11, 2024

హైదరాబాద్-విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు

image

దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చే వాహనాలు జాతీయ రహదారిపై బారులు తీరాయి. దీంతో జాతీయ రహదారిపై టోల్ గేట్‌ల వద్ద అదనపు బూత్‌లు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. వాహనాల రద్దీ పెరగడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట నుంచి గన్నవరం వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది.

News October 11, 2024

కైకలూరులో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400

image

కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. అటు NTR జిల్లాలో కూడా భారీగా పెరిగాయి. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా.. వాటికి వెల్లుల్లి తోడయింది. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ.400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లిని చేర్చాలంటున్నారు.

News October 11, 2024

ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దినిగా అమ్మవారు

image

ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొలిచిన వారికి కొంగుబంగారమై నిలుస్తూ భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

News October 11, 2024

కృష్ణా: BBA పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో BBA కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 10, 2024

జగ్గయ్యపేట వ్యక్తికి వైసీపీలో కీలక పదవి

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గయ్యపేటకు చెందిన ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించనున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటూరి చిన్నా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు.

News October 10, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో పీజీ, డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులు(సెమిస్టర్ బేస్డ్) చదివే విద్యార్థులు అక్టోబర్‌లో రాయాల్సిన పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. http://anucde.info/halltickets.php అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. Shareit

News October 10, 2024

కృష్ణా: రైతు బజార్‌లలో అతి తక్కువ ధరకు వంట నూనె

image

పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా నేటి నుంచి జిల్లాలోని అన్ని రైతు బజార్‌లలో వంట నూనె, టమాటాలు తక్కువ ధరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించనున్నట్లు కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124, పామోలిన్ లీటరు రూ.114లకు, కేజీ టమాటాలు రూ.50లకు విక్రయించనున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 10, 2024

కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాలకు 1734 దరఖాస్తులు

image

మద్యం దుకాణాలకు సంబంధించి కృష్ణా జిల్లాలో 1734 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. మొత్తం 123 దుకాణాలకు గాను బుధవారం రాత్రి 7గంటల సమయానికి ఆన్ లైన్ & ఆఫ్ లైన్‌లో 1734 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. దరఖాస్తు ఫీజు రూపేణా రూ.34.68కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చిందన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నామని అన్నారు.

News October 10, 2024

14న మచిలీపట్నంలో మద్యం టెండర్లు

image

కృష్ణాజిల్లాకు సంబంధించి ఈ నెల 14న మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో మద్యం టెండర్లు నిర్వహించనున్నట్టు ఉమ్మడి కృష్ణాజిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత టెండర్లు తెరిచే కార్యక్రమాన్ని నోబుల్ కాలేజీలో నిర్వహించాలని నిర్ణయించగా అనివార్య కారణాల వల్ల హిందూ కాలేజీ పీజీ సెంటర్, MBA బ్లాక్ కు మార్చడమైందన్నారు. ఈ మార్పును టెండరుదారులు గమనించాలన్నారు.

error: Content is protected !!