India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ళ నారాయణరావు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేదవారికి, మధ్య తరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతామన్నారు.
శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు ఆదివారం నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ లలితా దేవి తనను కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుందని పండితులు తెలిపారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించిన అమ్మవారు భక్తుల ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందన్నారు.
వైసీపీ పదేపదే తిరుమలపై దుష్ప్రచారం చేస్తోందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా శనివారం ట్వీట్ చేశారు. ‘ఎందుకు తిరుమల అంటే మీకు అంత కోపం, హిందువుల మనోభావాలంటే అంత చులకన’ అంటూ వైసీపీని సుజనా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. డిక్లరేషన్ మీద సంతకం చెయ్యమంటే చెయ్యరు.. కానీ తిరుమల మీద దుష్ప్రచారం చేస్తారని సుజనా ఈ మేరకు జగన్‌ను ఉద్దేశించి Xలో పోస్ట్ చేశారు.
తాడిగడపలోని పులిపాక రోడ్డులో గల ది ఇండియన్ షూటింగ్ స్పాట్ అకాడమీలో అక్టోబర్ 8న రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీను, ఏం.శ్రీనివాస్ తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్- 14, 17 బాల, బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు.
రైతులు ఈ పంటను నమోదు చేయించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శనివారం గూడూరు మండలం రామరాజు పాలెం గ్రామ పరిధిలో జరిగే ఈ-పంట నమోదును కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పంట నమోదు ప్రక్రియను పూర్తిస్థాయిలో త్వరగా చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు పండించిన ధాన్యం విక్రయాలకు ఈ పంట నమోదు తప్పనిసరి అని చెప్పారు.
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి ట్రిపుల్ ఐటీలు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూర ప్రాంతాల్లోని తమ ఇళ్లకు వెళ్లేందుకు 45 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఒకటితో ముగియగా ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పలువురు చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆయన్ను వివరణ కోరనుంది. ఇదే సమయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు శావల దేవదత్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలికపూడిని ఇవాళ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని అధిష్ఠానం ఆదేశించింది.
శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు శనివారం శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమై, జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్‌సిద్ధి సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అన్నపూర్ణమ్మను పూజిస్తే ఆకలిదప్పుల బాధలు ఉండవని తెలిపారు.
ఏపీ టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్‌గా డా.నూకసాని బాలాజీ శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ ఆటోనగర్‌లోని APTDC కార్యాలయంలో ఉదయం 10.50 గంటలకు APTDC ఛైర్మన్‌గా నూకసాని బాధ్యతలు స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తోపాటు NDA కూటమి పక్షాల నేతలు పాల్గొంటారని పేర్కొన్నాయి.
Sorry, no posts matched your criteria.