Krishna

News October 4, 2024

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా రవినాయుడు బాధ్యతలు

image

ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా అనిమిని రవి నాయుడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతతో ముందుకు సాగుతానని తెలిపారు. తనతోపాటు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్నతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

News October 4, 2024

కోడూరు: కనకదుర్గమ్మకు వెండి కవచం బహుకరణ

image

కోడూరు మండలం నరసింహపురం రోడ్డులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి వెండి కవచాన్ని బహుకరించారు. శుక్రవారం కోడూరు గ్రామానికి చెందిన పోతన ప్రసాద్ కుంటుంబ సభ్యులు రూ.1,01,116 విలువగల వెండి కవచం, చీర, సారే అమ్మవారికి బహుకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ఛైర్మన్ రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి కవచాన్ని అలంకరించారు.

News October 4, 2024

విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్

image

విజయవాడ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన రామవరప్పాడు రింగ్-మహానాడు రోడ్డు వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బెంగళూరులో ఇటీవల నిర్మించిన ఈ తరహా ఫ్లైఓవర్ మాదిరిగా 6.5కి.మీ. మేర మహానాడు రోడ్డు-నిడమానూరు వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ ఫ్లైఓవర్‌లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ సైతం నిర్మించనున్నట్లు సమాచారం.

News October 3, 2024

తిరువూరు: శావల దేవదత్‌కు శుభాకాంక్షల వెల్లువ

image

తిరువూరు నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జ్ టీడీపీ నేత శావల దేవదత్ గురువారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పున:ప్రారంభించారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదం నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలు దేవదత్‌కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

News October 3, 2024

VJA: ముంబై నటి కేసులో కీలక అప్డేట్

image

ముంబై నటి జెత్వానీ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు తొందరపాటు చర్యలు వద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం పొడిగింపు చేసింది. ఇవే ఆదేశాలు కేసులో ముద్దాయిలుగా ఉన్న ఏసీపీ, సీఐలకు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది.

News October 3, 2024

విజయవాడ దుర్గమ్మ బంగారు కిరీటాన్ని చూశారా

image

విజయవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు ఇటీవల బంగారు కిరీటాన్ని అందజేశారు. రూ.2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ కిరీటాన్ని గురువారం కనకదుర్గమ్మ వారికి అర్చకులు అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా నేడు అలంకరించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పారు.

News October 3, 2024

17 గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తాం: కలెక్టర్

image

పీఎం జనజాతీయ ఉన్నత గ్రామఅభియాన్(పీఎం జుగా) పథకంలో ఎన్టీఆర్ జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న 17 గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తామని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ గ్రామాలలో గిరిజన జనాభా ఎక్కువ ఉన్నందున ఈ పథకం అమలవుతుందని ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో స్వయం ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేస్తామన్నారు.

News October 3, 2024

కృష్ణా: ముంబై నటీ జెత్వానీ కేసులో నేడు హైకోర్టులో విచారణ

image

ముంబై నటీ జెత్వానీ కేసులో గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులు మంగళవారం తమ వాదనలు వినిపించగా న్యాయస్థానం కేసును గురువారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ.. న్యాయవాది వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించనున్నారు.

News October 3, 2024

వాహనాలకు ఎలాంటి పాస్ ఇవ్వడంలేదు: కలెక్టర్

image

విజయవాడ దసరా ఉత్సవాలలో VIP దర్శనాలకు ప్రత్యక యాప్ అందుబాటులోకి తెచ్చి 21 కేటగిరిల్లో పాస్‌లు ఇచ్చామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ పాస్‌లు కేవలం దర్శనం కోసమేనని, వాహనాలకు ఎలాంటి పాస్ ఇవ్వడంలేదన్నారు. ఈ పాస్‌లు ఉన్నవారు పున్నమి ఘాట్ వద్దకు చేరుకుంటే, అక్కడి నుంచి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కార్లలో ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుస్తామని కలెక్టర్ చెప్పారు.

News October 3, 2024

విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి APSRTC ఏసీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు(సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!