India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దసరాను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC అధికారులు తెలిపారు. ఈ నెల 4 నుంచి 20 వరకు సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులకు చిల్లర సమస్య రాకుండా ఉండేందుకు UTS, నగదు చెల్లింపు యాప్స్ అందుబాటులో ఉంటాయన్నారు. దసరా సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మొత్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా సాక్షాత్కరిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారని పండితులు తెలిపారు. ఈ రోజున 2 నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు.
మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ గంగాధర్ రావు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం జిల్లాలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కోసమే జీవించి దేశం కోసమే మరణించిన వ్యక్తులలో లాల్ బహుదూర్ శాస్త్రి ఒకరని తెలిపారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS), హైదరాబాద్(HYD) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.07631 HYD- NS ట్రైన్‌ను OCT 5 నుంచి NOV 30 వరకు ప్రతి శనివారం, నం.07632 NS- HYD ట్రైన్‌ను OCT 6 నుంచి DEC 1 వరకు ప్రతి ఆదివారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ ట్రైన్లు జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభిస్తున్నామని ఆలయ EO కెఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాలయ దర్శనాలు రద్దు చేశామన్నారు. ఉత్సవాలకు 15 లక్షల మంది వరకూ వస్తారని అంచనా వేశామన్నారు. శరన్నవరాత్రులలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు చండీయాగం నిర్వహిస్తామన్నారు.
ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి, శ్రీశైల భ్రమరాంబికా దేవి నవరాత్రి ఉత్సవాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్‌కు మంత్రి ఆనం, వేదపండితులతో చేరుకుని అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదం ఇచ్చి గవర్నర్‌కు శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికలను అందజేశారు.
సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పులు జరిగాయి. కొద్దిసేపటి కిందటే ఆయన బందరు పోర్టుకు బయల్దేరారు. మచిలీపట్నం పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు.. తాడేపల్లి వెళ్లాల్సి ఉంది. కాగా, షెడ్యూల్లో మార్పులు చేసుకొని పోర్టుకు బయల్దేరారు. కాగా, మచిలీపట్నం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోర్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
కృష్ణా, NTR జిల్లాలలో అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. 2 జిల్లాలలోని 9 కేంద్రాలలో మొత్తంగా 58,089 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు టెట్ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతోందని చెప్పారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన స్మృతికి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ రాజ్‌భవన్ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధీజీ చేసిన శాశ్వతమైన బోధనలు మనందరికీ మార్గదర్శకమని, ప్రజలకు స్ఫూర్తినిచ్చే జీవన విధానంగా అహింస మార్గాన్ని ఆయన బోధించారని గవర్నర్ స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి, మైలవరం వైసీపీ ఇన్‌ఛార్జ్ జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో నేడు హాజరుకావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.