India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరువూరు నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జ్ టీడీపీ నేత శావల దేవదత్ గురువారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పున:ప్రారంభించారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదం నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలు దేవదత్‌కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
ముంబై నటి జెత్వానీ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు తొందరపాటు చర్యలు వద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం పొడిగింపు చేసింది. ఇవే ఆదేశాలు కేసులో ముద్దాయిలుగా ఉన్న ఏసీపీ, సీఐలకు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది.
విజయవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు ఇటీవల బంగారు కిరీటాన్ని అందజేశారు. రూ.2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ కిరీటాన్ని గురువారం కనకదుర్గమ్మ వారికి అర్చకులు అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా నేడు అలంకరించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పారు.
పీఎం జనజాతీయ ఉన్నత గ్రామఅభియాన్(పీఎం జుగా) పథకంలో ఎన్టీఆర్ జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న 17 గ్రామాలలో అభివృద్ధి పనులు చేస్తామని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ గ్రామాలలో గిరిజన జనాభా ఎక్కువ ఉన్నందున ఈ పథకం అమలవుతుందని ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో స్వయం ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేస్తామన్నారు.
ముంబై నటీ జెత్వానీ కేసులో గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారుల తరఫు న్యాయవాదులు మంగళవారం తమ వాదనలు వినిపించగా న్యాయస్థానం కేసును గురువారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ.. న్యాయవాది వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలు వినిపించనున్నారు.
విజయవాడ దసరా ఉత్సవాలలో VIP దర్శనాలకు ప్రత్యక యాప్ అందుబాటులోకి తెచ్చి 21 కేటగిరిల్లో పాస్‌లు ఇచ్చామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఈ పాస్‌లు కేవలం దర్శనం కోసమేనని, వాహనాలకు ఎలాంటి పాస్ ఇవ్వడంలేదన్నారు. ఈ పాస్‌లు ఉన్నవారు పున్నమి ఘాట్ వద్దకు చేరుకుంటే, అక్కడి నుంచి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కార్లలో ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుస్తామని కలెక్టర్ చెప్పారు.
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు మీదుగా తిరుపతికి ఇంద్ర AC బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజు అర్థరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకునే ఈ బస్సు(సర్వీస్ నం.47745) ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
దసరాను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC అధికారులు తెలిపారు. ఈ నెల 4 నుంచి 20 వరకు సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులకు చిల్లర సమస్య రాకుండా ఉండేందుకు UTS, నగదు చెల్లింపు యాప్స్ అందుబాటులో ఉంటాయన్నారు. దసరా సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మొత్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా తొలి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా సాక్షాత్కరిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారని పండితులు తెలిపారు. ఈ రోజున 2 నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు.
మచిలీపట్నం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ గంగాధర్ రావు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ ఆశయాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం జిల్లాలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కోసమే జీవించి దేశం కోసమే మరణించిన వ్యక్తులలో లాల్ బహుదూర్ శాస్త్రి ఒకరని తెలిపారు.
Sorry, no posts matched your criteria.