India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావును కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల గురించిన నూతన డీజీపీకి ఎస్పీ వివరించారు.
జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై సమీక్షించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో క్రీడాకారులు, ప్రజల సౌకర్యార్థం కేలో ఇండియా ప్రాజెక్ట్ ద్వారా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైన వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైన వారికి 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది.
జిల్లాలో ఎక్కడ అతిసార వ్యాధి ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు. శుక్రవారం నాడు జరిగిన రాష్ట్రవ్యాప్త కాన్ఫరెన్స్‌లో భాగంగా ఢిల్లీ రావు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రబలింది అన్న ప్రచారం ఉండకూడదని అన్నారు. వర్షాకాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను హెచ్చరించారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2023లో నిర్వహించిన LLB కోర్సుల 5, 9వ సెమిస్టర్ల రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
జిల్లాలో డయారియా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి ఆయన హాజరయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్యాభర్తలు ఫ్యాన్‌కు ఉరివేసుకొని శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పడమట సీఐ మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇరువురు మృతిచెందడంతో ఒక్కసారిగా రామలింగేశ్వర నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి కృష్ణా నుంచి ఈ సారి ఆరుగురు నాయకులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాస్, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ నుంచి సుజనా చౌదరి శాసనసభకు మొదటిసారి ఎన్నికయ్యారు. వీరిలో కృష్ణప్రసాద్(పెడన), వెంకట్రావు(గన్నవరం) 2019లో పోటీ చేసి ఓడిపోయి రెండో పర్యాయం గెలుపొందగా, మిగతా నలుగురు తొలిసారి పోటీ చేసి విజయం అందుకున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2019, 2024లో శాసనసభలో ముగ్గురు మాత్రమే అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ ఈ సారి నూజివీడు, మైలవరం నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. 2019తో పాటు తాజా ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన గద్దె రామ్మోహన్ మరోమారు అసెంబ్లీకి వెళ్లారు.
నోబుల్ కళాశాలలో ఈ నెల 23న సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా హాకీ సంఘ కార్యదర్శి హరికృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 1995, జనవరి 1 కంటే ముందు జన్మించిన ఆటగాళ్లు ఎంపిక పోటీలకు ధ్రువపత్రాలతో 23న ఉదయం 8 గంటలకు నోబుల్ కళాశాలకు రావాలని చెప్పారు. ఎంపికైనవారు అంతర్ జిల్లాల పోటీలలో కృష్ణా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.
Sorry, no posts matched your criteria.