Krishna

News June 20, 2024

2వ రోజు డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్షలు

image

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ గురువారం ఉదయం పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సోషల్‌ ఆడిట్‌ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా నిన్న బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే పవన్ 10 గంటలపాటు సమీక్షలు నిర్వహించినట్లు జనసేన తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది.

News June 20, 2024

దాడులకు ఏ మాత్రం భయపడం: కొడాలి నాని

image

రుషికొండ భవనాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందిచారు. ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనాలను జగన్ ఇళ్లు అన్నట్లు టీడీపీ ప్రచారం చేస్తోందని, ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన అవసరం జగన్‌కు లేదన్నారు. ఫలితాల అనంతరం వైసీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాని, వాటికి తాము ఏమాత్రం భయపడమన్నారు. కూటమి ప్రభుత్వం హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలన్నారు.

News June 20, 2024

KRU: బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో బీటెక్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల టైం టేబుల్ విడుదల అయింది. జూలై 2, 4, 6, 8,10 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News June 20, 2024

కృష్ణా: బీపీఈడీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో బీపీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదల అయింది. జూన్ 28, 29, జూలై 1, 2 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News June 20, 2024

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి

image

మంత్రిగా వాసంశెట్టి సుభాష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

News June 20, 2024

అది ఉద్యోగ ప్రకటన కాదు: విజయవాడ డివిజన్ రైల్వే

image

ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ (ATVM) ఫెసిలిటేటర్స్ కొరకు విజయవాడ రైల్వే డివిజన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఉద్యోగ ప్రకటన కాదని గమనించాలని అధికారులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ATVM ఫెసిలిటేటర్స్‌కు ఎలాంటి పారితోషికం/వేతనం ఉండదని, వీరికి టికెట్ సేల్‌పై బోనస్ మాత్రమే ఉంటుందని వారు తెలిపారు. పూర్తి వివరాలకు https://scr.indianrailways.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.

News June 20, 2024

ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

image

విజ‌య‌వాడ‌ క్యాంపు కార్యాల‌యంలో బుధవారం ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ బాధ్య‌త‌ల స్వీక‌రణ సంద‌ర్భంగా.. ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌ డిల్లీరావు బుధవారం మ‌ర్యాద‌ పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News June 19, 2024

నేను ఎవరి భూములను ఆక్రమించుకోలేదు: మాజీ మంత్రి

image

మాజీమంత్రి పెనమలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ జోగి రమేశ్‌పై వస్తున్న భూ ఆక్రమణలపై ఆయన స్పందించారు. తనపై భూ అక్రమాల గురించి వచ్చే వార్తలు కేవలం ఎల్లో మీడియా కల్పిస్తున్న కథనాలే అన్నారు. తాను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనకున్న భూమి కూడా న్యాయపరంగా కొన్నామని తెలిపారు.

News June 19, 2024

మాజీ మంత్రి రోజాపై బుద్ధా వెంకన్న ఫైర్

image

రుషి కొండలోని పర్యాటక స్థలంలో పర్యాటన భవనాలు నిర్మించడం తప్పా అంటూ Xలో మాజీ మంత్రి రోజా చేసిన పోస్టుకు మాజీ MLC TDP నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషి కొండపై కట్టిన నిర్మాణాలు నాడేమో CM ఉండడానికని చెప్పిన రోజా ఇప్పుడేమో పర్యాటకుల కోసం నిర్మించామని చెబుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి రోజాపై ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు ఏంటో బయటికి వస్తాయని అన్నారు.

News June 19, 2024

విజయవాడ: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దమ్మాలపాటి.?

image

కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఆయన 2016 మే 28 నుంచి 2019 ఏజీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. 1991లో దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు.