Krishna

News June 18, 2024

జోగి రమేశ్ కంకిపాడులోకి రావొద్దంటూ బ్యానర్

image

మాజీ మంత్రి జోగి రమేశ్ కంకిపాడు గ్రామంలోకి రావద్దంటూ ఆ గ్రామ బస్టాండ్ వద్ద భారీ బ్యానర్ వెలిసింది. పవన్ కళ్యాణ్‌‌ను పదే పదే వ్యక్తిగతంగా విమర్శించిన ఆయన్ను కంకిపాడులో ఏ కార్యక్రమానికీ ఆహ్వానించొద్దంటూ దానిపై రాశారు. ఆయన హాజరైతే తదుపరి పరిణామాలకు వైసీపీ వారే బాధ్యులు అని రాయడం కలకలం రేపింది. బ్యానర్ ఏర్పాటు వివాదాస్పదం కావడంతో పోలీసులు ఆ బ్యానరును తొలగించారు.

News June 18, 2024

కృష్ణా: స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున నం.12803, నం.12804 స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 5 వరకు విజయవాడ-బల్లార్షా-నాగ్‌పూర్ మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా నాగ్‌పూర్ చేరుకుంటాయన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు.

News June 17, 2024

కృష్ణా: CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ ఫొటోలతో ర్యాలీ చేసిన మంత్రి

image

నూజివీడు నియోజకవర్గం నుంచి TDPతరఫున MLAగా గెలిచిన కొలుసు పార్థసారథికి సమాచార శాఖ, గృహనిర్మాణ మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గానికి సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నూజివీడులో పార్టీ శ్రేణులు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానులు ఆయనకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు ఇవ్వగా అవి పట్టుకొని ర్యాలీగా ముందుకుసాగారు.

News June 17, 2024

కృష్ణా: BA.LLB కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన BA.LLB కోర్సు 5వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 24లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News June 17, 2024

కృష్ణా: ప్రయాణికులకు కీలక సూచన చేసిన APSRTC

image

కృష్ణా- ఆర్టీసీ బస్సు ప్రయాణికులు తమ సందేహాలు, ఫిర్యాదులు, అభిప్రాయాలు, సూచనలు, సమాచారానికై APSRTC కాల్ సెంటర్ నంబర్ 149కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు RTC అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కాల్ చేస్తున్నట్లైతే 0866-149 నెంబరుకు డయల్ చేయాలని APSRTC అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News June 17, 2024

విజయవాడ: ఈనెల 19న వైసీపీ నేతలతో జగన్ సమావేశం

image

ఈనెల 19వ తేదీన రాష్ట్రంలోని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్యేలు ఎంపీలతో మాజీ సీఎం జగన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు అందరికీ ఆహ్వానాలు ప్రకటించారు. ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వైసీపీ నాయకులు అందరికీ ఆహ్వానం పంపించినట్లు వైసీపీ కార్యాలయం తెలిపింది.

News June 17, 2024

కృష్ణా: పీజీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన MA, M.COM, M.HRM4వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు రేపు మంగళవారంలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News June 17, 2024

కృష్ణా: అడ్మిషన్లకు దరఖాస్తుకు రేపే ఆఖరు

image

నూజివీడులోని YSR హార్టికల్చర్ యూనివర్సిటీలో 2ఏళ్ల ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. SSC పాసైన విద్యార్థులు https://drysrhu.ap.gov.in/అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ పి.విజయలక్ష్మి చెప్పారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి సీట్లు భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.

News June 17, 2024

విజయవాడలో మాజీ కార్పొరేటర్ అర్ధనగ్న ప్రదర్శన

image

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ దళిత నాయకుడినైన తనపై, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గూండా గిరి చేస్తున్నారని YCP మాజీ కార్పొరేటర్ నందెపు జగదీశ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో YCP తరఫున ప్రచారం చేశాననే కోపంతో తనకు చెందిన భవనాన్ని బోండా ఉమా అనుచరులు JCBతో కూల్చేశారన్నారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన తాను కూల్చిన భవనం వద్ద <<13456099>>శిరోముండనం చేయించుకుని<<>> అర్ధ నగ్నంగా నిరసన తెలిపానన్నారు.

News June 17, 2024

కృష్ణా: విద్యార్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర విద్యాశాఖ

image

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్వయం పోర్టల్‌లో 9-12 తరగతుల విద్యార్థులకు, సైన్స్ తదితర సబ్జెక్టులలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నట్లు NCERT తెలిపింది. ఈ కోర్సులు నేర్చుకునే వారు https://swayam.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 1లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌లో కోర్సు పూర్తైన తర్వాత అసెస్‌మెంట్, సర్టిఫికేషన్ ఉంటాయని NCERT స్పష్టం చేసింది.