India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ దళిత నాయకుడినైన తనపై, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గూండా గిరి చేస్తున్నారని YCP మాజీ కార్పొరేటర్ నందెపు జగదీశ్ ఆరోపించారు. గత ఎన్నికల్లో YCP తరఫున ప్రచారం చేశాననే కోపంతో తనకు చెందిన భవనాన్ని బోండా ఉమా అనుచరులు JCBతో కూల్చేశారన్నారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన తాను కూల్చిన భవనం వద్ద <<13456099>>శిరోముండనం చేయించుకుని<<>> అర్ధ నగ్నంగా నిరసన తెలిపానన్నారు.
కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్వయం పోర్టల్‌లో 9-12 తరగతుల విద్యార్థులకు, సైన్స్ తదితర సబ్జెక్టులలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నట్లు NCERT తెలిపింది. ఈ కోర్సులు నేర్చుకునే వారు https://swayam.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 1లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌లో కోర్సు పూర్తైన తర్వాత అసెస్‌మెంట్, సర్టిఫికేషన్ ఉంటాయని NCERT స్పష్టం చేసింది.
భక్తి భావం, త్యాగం ప్రేమలకు ప్రతి కైన ముస్లిం సోదరులకు కలెక్టర్ ఢిల్లీ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని చేసిన ఈ ప్రకటనలో ముస్లిం సోదరులు ఎల్లప్పుడూ.. సుఖ సంతోషాలతో గడపాలని ఆయన కోరారు. జిల్లా వ్యాప్తంగా ఈ పండుగను సాంప్రదాయ పద్ధతిలో విజయవంతం చేయాలని ముస్లిం సోదరులకు చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులతో ఆదివారం సీపీ రామకృష్ణ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ఉన్న పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. నగర వ్యాప్తంగా క్రమం తప్పకుండా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ముస్లిం సోదరులు కూడా దేవునిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి, ఎదుటివారికి సహాయం చేయాలనీ తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలన్నారు.
సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుందని, 2, 3 తేదీల్లో రాష్ట్ర సమితి సమావేశాలు కొనసాగుతాయన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ సమావేశాలకు హాజరవుతారని, ఈ సమావేశాలు జయప్రదం చేయాలని ఆయన తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒడిశా రాష్ట్రం కటక్‌లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ ఫెన్సింగ్ పోటీలలో జగ్గప్పదొర కాంస్య పతకం సాధించాడు. దీనితో జగ్గప్ప అంతర్జాతీయ ఫెన్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా ఫెన్సర్ జగ్గప్పదొరను, శిక్షకులు లక్ష్మి లావణ్యను ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ సంఘం సభ్యులు నాగరాజు, విజయ్ కుమార్ అభినందించారు.
ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే నం.20803, నం.20804 విశాఖ-గాంధీధామ్ ట్రైన్లు ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 4 మధ్య విజయవాడ-విశాఖపట్నం మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు.
కాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున నం.20806, నం.20805 ఏపీ ఎక్స్‌ప్రెస్‌లు(AC) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 22 నుంచి జులై 5 వరకు విజయవాడ- బల్లార్షా- నాగ్‌పూర్ మీదుగా కాక విజయనగరం- రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదని పేర్కొన్నారు.
విజయవాడ శివారు గూడవల్లిలో విద్యార్థిని శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పటమట సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. అనంతపురానికి చెందిన జాహ్నవి చదువు నిమిత్తం గూడవల్లి వచ్చింది. శనివారం విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. జాహ్నవి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.