India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్‌లో రేప్ కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా హర్షసాయి విజయవాడలో ఉన్నట్లు తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షసాయి కేసులో అతడి లాయర్ విజయవాడకు చెందిన టీ.చిరంజీవి సహకారంతో విజయవాడలో తలదాచుకున్నట్లు తాజాగా కథనాలు వెలువడ్డాయి.
కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని చెన్నై-కోల్‌కత్తా హైవేపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి వస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్(25), మేరీ(38)గా గుర్తించారు. క్షతగాత్రుల్ని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏ.కొండూరు అడ్డరోడ్డులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తండ్రి కొడుకులను లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. మామిళ్ల శ్రీనివాసరావు(45), కుమారుడు ప్రసంగి(16) షాపు క్లోజ్ చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లాలోని పలు విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాశ్‌ను నియమించారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా భువనేశ్వర్(BBS), యశ్వంత్‌పూర్(YPR) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02811 BBS-YPR ట్రైన్‌ను అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం, నం.02812 YPR-BBS ట్రైన్‌ను అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏ.కొండూరు అడ్డరోడ్డులో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా తెలుస్తోండగా.. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పురోగతి సాధించి, బాధితులకు సత్వర న్యాయమందించే దిశగా ప్రణాళికల రూపొందించాలని ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తెలిపారు. మచిలీపట్నం
జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో ఎస్పీ బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై దిశా నిర్దేశం చేసి, స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందించి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2,4,6వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 4 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వైసీపీ నాయకులతో బుధవారం మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని తన కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం కృష్ణా జిల్లాకు పేర్నినానిని, ఎన్టీఆర్ జిల్లాకు దేవినేని అవినాశ్‌ను.. జగన్ వైసీపీ జిల్లా అధ్యక్షులుగా నియమించారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
విజయవాడలోని కేబీఎన్ కళాశాలలోని క్రీడా మైదానంలో సెప్టెంబర్ 26న ఎస్జీఎఫ్ అండర్ 19 ఉమ్మడి కృష్ణా జిల్లా హ్యాండ్ బాల్, చెస్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ కార్యదర్శి రతికాంత బుధవారం తెలిపారు. ఈ పోటీలకు 01-01-2006 తరువాత పుట్టినవారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు.
Sorry, no posts matched your criteria.