India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నూజివీడు పట్టణంలోని విక్టోరియా టౌన్ హాల్ క్రీడా మైదానంలో బుధవారం హోరా హోరీగా ఉమ్మడి కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అండర్ 14,17 విభాగాలలో బాలికలు, బాలుర ఉమ్మడి కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ జట్లను ఎంపిక చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో ఈ జట్లు పాల్గొంటాయని సీనియర్ పీడీ, కోచ్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకుల వినియోగంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దేవాదాయ శాఖ అంతర్గత విచారణలో భాగంగా జరిపిన 2 రోజుల తనిఖీల్లో రూ.15 లక్షల విలువైన నాసిరకం సరుకులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. నిర్ణీత ప్రమాణాలు పాటించకపోవడంపై జరిపిన దర్యాప్తులో అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక సిద్ధమైనట్లు సమాచారం.
విజయవాడ మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు 2 రోజులపాటు వికారాబాద్(TG)లో స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. వికారాబాద్ సమీపంలోని కణ్హ శాంతివనంలో ఆధ్యాత్మిక అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నందున ఈ నెల 29, 30వ తేదీలలో నం.11020 భువనేశ్వర్- CST ముంబై మధ్య ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వికారాబాద్‌లో ఆగుతుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు.
కృష్ణా జిల్లాలో భారీగా వీఆర్ఓల బదిలీలు జరిగాయి. ఉద్యోగుల బదిలీల్లో భాగంగా మొత్తం 139 వీఆర్ఓలను బదిలీ చేస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో గ్రేడ్-1 వీఆర్ఓలు 77 మంది ఉండగా గ్రేడ్-2 వీఆర్ఓలు 62 మంది ఉన్నారు. వీరిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేశారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీ నేతలతో నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం అవ్వనున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న జిల్లా ఇన్‌ఛార్జులు హాజరవునుఉన్నట్లు సమాచారం. ఇటీవల జగ్గయ్యపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జగ్గయ్యపేటకు నూతన ఇన్‌ఛార్జ్‌ను జిల్లాకు చెందిన దేవినేని అవినాశ్‌ను నియమించినట్లు సమాచారం.
స్వర్ణాంధ్రప్రదేశ్ – 2047 దార్శనిక పత్రం (విజనరీ డాక్యుమెంట్) తయారీపై ప్రజలు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేసి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, MPDOలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజనరీ డాక్యుమెంట్ తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయడంపై సమీక్షించారు.
తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న కొనకళ్ల నారాయణరావు త్యాగానికి ప్రతిఫలం దక్కింది. మచిలీపట్నం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన నారాయణరావు 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మచిలీపట్నం ఎంపీ సీటును జనసేన పార్టీకి త్యాగం చేశారు. జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసిన బాలశౌరి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా నారాయణరావును APSRTC ఛైర్మన్ పదవి వరించింది.
నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా APSRTC ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణరావు నియమితులయ్యారు. మచిలీపట్నంకు చెందిన ఈయన జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత. 2009, 2014లో మచిలీపట్నం ఎంపీగా టీడీపీ నుంచి విజయం సాధించారు. 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో 9మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. కాదంబరి జెత్వానీ, ఆమె తల్లి ఆశా, తండ్రి నరేంద్ర కుమార్‌తో పాటు పలువురిని ఆ లిస్టులో చేర్చి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. మరోవైపు, నిందితుడు విద్యాసాగర్‌ను నిన్న ఉదయం విజయవాడ జిల్లా జైలుకు తరలించి, కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడి న్యాయవాది కౌంటర్ దాఖలు చేయడం కోసం కేసును జడ్జి నేటికి వాయిదా వేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో వరదలతో ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు. ఈ క్రమంలో దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలకు సంబంధించి 49.17శాతం క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సోమవారం తెలిపారు. మొత్తంగా 11,046 క్లెయిమ్‌లు రిజిస్టర్ కాగా.. 5,399 సెటిల్ చేసినట్టు చెప్పారు. 2,145 రుణ ఖాతాలకు 164.95 కోట్లు రీ షెడ్యూల్ చేసినట్టు కలెక్టర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.