India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల నుంచి వస్తున్న రుణాల రీ షెడ్యూల్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. పలు బ్యాంకుల అధికారులు, సబ్ కలెక్టరేట్‌లోని ఫెసిలిటేషన్ కేంద్రం ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే 615 ఖాతాలకు సంబంధించి రూ. 51.37 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్ర స్థాయి త్రో బాల్ పోటీలకు ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టును ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా త్రో బాల్ సంఘం కార్యదర్శి సులోచన తెలిపారు. పురుషుల జట్టుకు రవివర్మ, ప్రమోద్, చరణ్‌తేజ్, చరణ్‌సాయి, యశ్వంత్, రాము, సాయిసంతోష్, రాజ్‌దీప్, జ్యోతివర్మ, అక్షయ్, సూర్య, వెంకటేష్, భాస్కర్, జోసఫ్, అఖిల్, మహిళల జట్టుకు శ్రావణి, జోషిత, సాయిదుర్గ, దక్షిణి, నీరజ, దుర్గ, రితిక ఎంపికైనట్లు చెప్పారు.
విజయవాడ నోవాటెల్ హోటల్‌లో జరిగిన “ఏపీ- వియత్నాం టూరిజం కాన్‌క్లేవ్- 2024” శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సదస్సులో వియత్నాం తరపున ముఖ్య అతిథిగా హాజరైన హెచ్.ఈ.ఎంగ్యూయేన్‌కు రాష్ట్రంలోని పర్యాటక రంగ అంశాలను మంత్రి దుర్గేష్ వివరించారు. భవిష్యత్తులో ఏపీ- వియత్నాం మధ్య పర్యాటక, సాంస్కృతిక బదిలీకి మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని హాజరైన వియత్నాం ప్రతినిధులు హామీ ఇచ్చారు.
బాడీ మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. మాచవరం సీఐ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రినగర్‌లో బాడీ మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం దాడి చేశామన్నారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలను, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని జగన్ గుర్తు చేసుకున్నారు. జయప్రకాశ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో శుక్రవారం అరెస్టయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు శనివారం విజయవాడకు తీసుకురానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం డెహ్రాడూన్‌లోని మూడో అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు ప్రవేశపెట్టినట్లు తాజాగా సమాచారం వెలువడింది. డెహ్రాడూన్‌లో అరెస్టయిన విద్యాసాగర్‌ను ట్రాన్సిట్ వారెంట్‌పై పోలీసులు విజయవాడకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
సస్పెన్షన్‌లో ఉన్న IPS అధికారి కాంతిరాణా టాటా ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారణ జరపనున్నట్లు సమాచారం. కాగా కాదంబరి జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం కాంతి రాణా టాటాను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున ఆ మార్గం గుండా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు విజయవాడ-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను(నం.12718 &12717) ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y23 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల జరిగిన బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు 2వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.