India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ, గుడివాడ మీదుగా తిరుపతి(TPTY)- బిలాస్పూర్ (BSP) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్‌లకు కొవ్వూరులో దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా స్టాప్ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌలభ్యం మేరకు కొవ్వూరులో ఇచ్చిన స్టాప్‌ను ఈ నెల 21 నుంచి పొడిగిస్తున్నామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17481 BSP-TPTY రైలు ఈ నెల 21 నుంచి, నం.17482 TPTY-BSP రైలు ఈ నెల 22 నుంచి కొవ్వూరులో ఆగుతుందన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదివే డిగ్రీ విద్యార్థులకు నిర్వహించే 3,5వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 14లోపు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఈ పరీక్షలు నవంబర్ 11 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఫీజు, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని కోరింది.
2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్ పొందేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గుడివాడ ITI కాలేజీ ప్రిన్సిపల్ ఎల్. గౌరీమణి తెలిపారు. https://www.iti.ap.gov.in/ వెబ్సైట్లో అడ్మిషన్లకు ఈ నెల 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ నెల 28న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
వరదల కారణంగా దెబ్బతిన్న చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాల ఆస్తులకు సంబంధించిన 4,500 క్లెయిములను పరిష్కరించామని కలెక్టర్ సృజన అన్నారు. ఈ అంశంపై ఆమె గురువారం మాట్లాడుతూ..4,500 క్లెయిముల ద్వారా రూ.27.93 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన క్లెయిములు పరిష్కారం అయ్యాయన్నారు. ప్లంబర్, AC మెకానిక్ సేవలను పొందేందుకు 44,15 సర్వీస్ రిక్వెస్టులు నమోదు కాగా 95.7% రిక్వెస్టులకు సేవలను అందజేశామన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ విద్యార్థులకై నిర్వహించే 7వ సెమిస్టర్(హానర్స్) రెగ్యులర్ &సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 14లోపు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఈ పరీక్షలు నవంబర్ 4 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఫీజు,షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని కోరింది. Share it
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేపటితో 100 రోజులు పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ నెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీకానున్నారు. ఈ మేరకు గురువారం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌తో చర్చలు అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
ఇసుక Online బుకింగ్ విధానంపై గ్రామ / వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి పోర్టల్‌ను రేపు ప్రారంభిస్తారన్నారు.
విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడును మాజీ ఎంపీ, లైలా గ్రూప్ ఛైర్మన్, గోకరాజు గంగరాజు, ఎస్ఎల్వీ గ్రూప్ ఛైర్మన్ శ్రీనివాసరాజు, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును వారు సత్కరించారు. అనంతరం బుడమేరు వరద కారణంగా కేసరపల్లిలో ముంపుకు గురైన ఎస్ఎల్వీ లైలా గ్రీస్ మెడోస్ కాలనీవాసులకు భవిష్యత్తులో తమ నివాసాలవైపు వరద నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
భవానీపురం సబ్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విజయవాడ టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బీ.వీ సుధాకర్ తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు టీచర్స్ కాలనీ, అప్నా బజార్ రోడ్డు, ఇందిరా ప్రియదర్శినీ కాలనీ, దర్గాప్లాట్లు, హెచ్‌బీ కాలనీలోని 450 ఎస్ఎఫ్ఎ బ్లాక్ వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.