India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
35ఏళ్ల తర్వాత ‘నూజివీడు’కు మంత్రి పదవి దక్కింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 1952-72 వరకు వరుసగా 5సార్లు MLAగా గెలిచిన డా.ఎంఆర్ అప్పారావు, తర్వాత 1978, 1989లో గెలుపొందిన పాలడుగు వెంకటరావు మాత్రమే మంత్రులుగా పని చేశారు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా కొలుసు పార్థసారథికి మంత్రి పదవి దక్కింది. రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన కొలుసు.. 2009లో YSR, కిరణ్ కుమార్రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
CBN మంత్రివర్గంలో ఉమ్మడి కృష్ణా నుంచి ఇద్దరికి చోటు దక్కగా కొందరు సీనియర్లకు స్థానం లభించలేదు. అవనిగడ్డ నుంచి 4వ సారి అసెంబ్లీకి ఎన్నికైన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్కు కేబినెట్ చోటు దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. మంత్రివర్గంలో మండలికి చోటు దక్కకపోవడంతో ఆయనకు శాసనసభ స్పీకర్ పదవి దక్కవచ్చని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. బొండా ఉమా, గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాస్తో పాటు బీజేపీ నుంచి గెలిచిన సుజనా చౌదరి పేర్లు సైతం తొలుత ఆశావాహుల జాబితాలో వినిపించాయి. కాగా చంద్రబాబు తన మంత్రివర్గంలో ఒక స్థానాన్ని నేడు ఎవరికీ కేటాయించకుండా ఉంచారని, అది ఎన్టీఆర్ జిల్లా నేతలకు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో రేపు గురువారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వారు బుధవారం సాయంత్రం వెల్లడించారు. జిల్లాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద గాని, కరెంట్ పోల్స్ వద్ద గాని ఉండవద్దని, కురిసే వర్షాలకు అనుగుణంగా లోతట్టు ప్రాంత వాసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టర్ ఆయన చాంబర్లో కార్మిక, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోస్టల్ విడుదల చేశారు.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. ఆమె తమ్ముడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేసరపల్లిలోని చంద్రబాబు ప్రమాణస్వీకారానికి విచ్చేసిన ఆమె వేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన అక్క భువనేశ్వరి భుజం తట్టి నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టారు. ఈ దృశ్యం వేదికపై కూర్చున్నవారిని ఆకట్టుకుంది.
ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వాహనంలో కేసరపల్లికి బయల్దేరారు. కొద్దిసేపటి కిందటే విమానాశ్రయంలో ప్రధానికి చంద్రబాబు, గవర్నర్ స్వాగతం పలికారు. అనంతరం వారు కేసరపల్లిలోని సభా స్థలికి బయల్దేరారు. 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా వచ్చిన ఆయనకు గవర్నర్, చంద్రబాబు స్వాగతం పలికారు. కాసేపట్లో ముగ్గురూ గన్నవరం ఐటీ పార్కులోని ప్రమాణస్వీకార సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు.
గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రజానీకం భారీగా బయలుదేరిన నేపథ్యంలో జాతీయ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పొట్టిపాడు, కాజా టోల్ ప్లాజాలతో పాటు ఇబ్రహీంపట్నం, వారధి తదితర ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాయలసీమను నుండి భారీగా వచ్చిన వాహనాలతో వారధి వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి.
కాసేపట్లో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్యం కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లలేకపోతున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆయన.. త్వరలో వచ్చి నియోజకవర్గ ప్రజలను కలుస్తానని చెప్పారు.
Sorry, no posts matched your criteria.