India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో మీడియాను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ట్రాయ్‌కి వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పలు ఛానళ్ల ప్రసారాలను నిలుపుదల చేసేలా కేబుల్ ఆపరేటర్లపై కొత్త ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని లేఖలో పేర్కొన్నారు. సమాచారాన్ని తెలుసుకునే ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. ఈ విషయంలో ట్రాయ్ జోక్యం చేసుకుని ప్రసారాలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన MA, MCOM, MHR 4వ సెమిస్టర్ పరీక్షలకు(23-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 18లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
రేపటి చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం నిమిత్తం గన్నవరంలో 12 హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరి రాక నిమిత్తం వీఐపీల కాన్వాయ్ వెళ్లే దారిలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వివరాలు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తీర్మాన పత్రాన్ని మంగళవారం కూటమి నేతలు గవర్నర్‌కు అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌లు కలిసి విజయవాడలోని రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ముస్తాబాద- గన్నవరం రైల్వే సెక్షన్ మధ్య ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.06521 SMV బెంగుళూరు- గువాహటి ట్రైన్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ఈ నెల 11 నుంచి 25 వరకు విజయవాడ- ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రేపల్లెకు చెందిన మోపిదేవి రాజేశ్వరి అనే మహిళ మృతి చెందింది. తన భర్త, కుమారుడితో కలిసి తాళ్లపాలెంలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయగా.. రాజేశ్వరి ప్రమాదవశాత్తు లారీ కింద పడింది. లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
భావదేవరపల్లిలోని ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. SSC పాసైన అభ్యర్థులు https://apfu.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 10 నుంచి 26లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఏ చంద్రశేఖరరావు తెలిపారు. అడ్మిషన్లకు ఎలాంటి ప్రవేశపరీక్ష నిర్వహించమని, పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చని ఆయన స్పష్టం చేశారు.
గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్నందున బుధవారం ట్రాఫిక్ మళ్లించనున్నామని పోలీసులు తెలిపారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే రవాణా వాహనాలు హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుమూడి వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు సైతం ఇదే మార్గంలో వెళ్లాలన్నారు.
గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్నందున వాహనాలను మళ్లిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లే పాసులు ఉన్న వాహనాలు, అంబులెన్సులు, అత్యవసర ఆరోగ్య చికిత్స ఉన్న వాహనాలనే రేపు ఉదయం రామవరప్పాడు రింగ్ సెంటర్ నుంచి గన్నవరం వైపు అనుమతిస్తామని, ప్రజలు తమకు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు.
పెడన మండలంలో ఇటీవల వెలుగు చూసిన ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో ఇద్దరు VVAలను సస్పెండ్ చేసినట్టు, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి జ్యోతి తెలిపారు. ప్రాథమిక విచారణలో మడక, శింగరాయపాలెం వీవీఎల పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు. 152 మంది నకిలీ ఖాతాలకు రూ.40 లక్షలకు పైగా ఇన్‌పుట్ సబ్సిడీ జమ అయినట్టు విచారణలో తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.