India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 12న గన్నవరం మండలం కేసరపల్లిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ అతిథులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
భారత ప్రభుత్వ సూచనల మేరకు ఏపీ 2025లో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. కళలు, సాహిత్యం, వైద్యం, క్రీడలు సామజిక సేవా, సైన్స్, ప్రజా సంబంధాలు, సివిల్ సర్వీస్ రంగాలలో విశిష్ట సేవలు అందించినవారు అర్హులని అన్నారు. వీరు https//awards.giv.in పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఏ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. అనంతరం తీర్మాన ప్రతిని రాష్ట్ర గవర్నర్‌కు కూటమి నేతలు అందజేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కూటమి బృందం కోరనుంది.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి రెండు నూతన బొలెరో కార్లను ఉన్నతాధికారులు మంజూరు చేశారు. సోమవారం విజయవాడలో వీటిని సంబంధిత సిబ్బందికి విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ అందచేశారు. డివిజన్ పరిధిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఈ ఏడాది మే నెల వరకు 61 మంది చిన్నారులను హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రక్షించిందని నరేంద్రపాటిల్ తెలిపారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన బీ ఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానే ప్రకటన చేయడంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. నాని రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు, ప్రజలే తప్పించారని విమర్శించారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే విజయవాడ ప్రజలు కేశినేని నానిని ఓడించడం మరో ఎత్తు అని అన్నారు. చంద్రబాబుకి, నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలకు విజయవాడ ఎంపీ సీటు కలిసిరావడం లేదు. 2014లో ఓడిపోయిన కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019లో బరిలో దిగి ఓటమి చవిచూసిన తర్వాత పీవీపీ రాజకీయాలకు దూరం అయ్యారు. ఇదే క్రమంలో తాజా ఎన్నికల్లో ఓడిపోయిన కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇలా మూడుసార్లు ఓడిపోయిన వారు YCP అభ్యర్థులే కావడం గమనార్హం. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నాని కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే.
జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు టీడీపీ నేత గౌరినాథ్‌ను దారుణంగా హత్యచేయించారని అన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని ప్రజలు ఛీ కొట్టినా, బాబాయ్‌ని చంపినట్టే జననాన్ని జగన్ చంపుతున్నాడని మండిపడ్డారు. జగన్ హత్యా రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని నేడు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. కాగా నిన్న కేంద్రమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో గన్నవరంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రేపు ఉదయం విజయవాడలోని A కన్వెన్షన్‌లో పార్టీనేతలతో సమావేశం కానున్నారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న దాడుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటి ముందు ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.
Sorry, no posts matched your criteria.