India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు కృష్ణా జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసుల బదిలీలు నిర్వహించామని ఎస్పీ ఆర్. గంగాధర్ తెలిపారు. శుక్రవారం 135 మంది మహిళా పోలీసుల బదిలీల ప్రక్రియను తన కార్యాలయంలో నిర్వహించామని ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారు కోరుకున్న చోటుకే బదిలీలు చేశామని ఆయన స్పష్టం చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రైల్వే స్టేషన్లలో ఆరు స్టేషన్లు NSG(నాన్ సబర్బన్ గ్రూపు) జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రాయనపాడు, రామవరప్పాడు స్టేషన్లు NSG-5 కేటగిరిలో చోటు సంపాదించగా, కొండపల్లి, మధురానగర్, నిడమానూరు, గన్నవరం స్టేషన్లు NSG-6 ప్రపోజల్ కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి. కాగా రూ.528 కోట్ల రెవిన్యూతో విజయవాడ స్టేషన్ NSG-1 గుర్తింపు దక్కించుకుంది.
ఎస్పీ ఆర్. గంగాధర్ శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయుధాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా ఆయన అక్కడి ఆయుధాలను స్వయంగా పరిశీలించారు. ఆర్మోరర్ వర్క్ షాప్, యాంటీ రోయిట్ సామాగ్రి, మందు గుండు సామాగ్రి యొక్క నిర్వహణ, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఎస్పీ.. ఆయుధాగార నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తపరిచారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 23, 24, 25, 26 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్సిటీ పరిధిలోని 2 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
జిల్లాలో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు.
గంపలగూడెం మండల కేంద్రంలోని పడమట దళితవాడకు చెందిన రజిని ఇంటి ఆవరణలో 100 వరకు పాములు కలకలం రేపాయి. ప్రహారికి పడ్డ కన్నంలో పాములు కనిపించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒకే చోట చేరి గుట్టగా తయారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. వాటిని గమనించిన ఆ ఇంటి యజమానులు, చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వాటిని బయటకు తీసేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు.
విజయవాడలో బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. మాచవరం సీఐ ప్రకాశ్ తెలిపిన వివరాల మేరకు.. మొగల్రాజపురంలో బాడీ స్పా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశామన్నారు. అలాగే ఇద్దరు యువతులను రక్షించామని తెలిపారు. బాడీ స్పా నిర్వహిస్తున్న చైతన్య, నాగరాజును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇద్దరు మహిళలను సంరక్షణా కేంద్రానికి పంపించామన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక, జర్నలిస్ట్ కాలనీ, రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వరద నీటి పంపింగ్ పనులను గురువారం రాత్రి మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వరద నీటిని బయటకి పంపించేందుకు భారీ మోటర్ల సహాయంతో చర్యలు చేపట్టామన్నారు. కొన్నిచోట్ల రోడ్లకు గండ్లు కొట్టి మరి నీటిని బయటికి పంపించామన్నారు.
కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గొల్లు కృష్ణ గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. కృష్ణ మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.
విజయవాడలో మంత్రి నారాయణ, బొండా ఉమామహేశ్వరావుతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ కారు నీటి గోతిలో కూరుకుపోయింది. సిబ్బంది క్రేన్ సహాయంతో కారును గోతిలో నుంచి వెలికితీశారు. అనంతరం మంత్రి పర్యటన కొనసాగింది.
Sorry, no posts matched your criteria.