Krishna

News April 29, 2024

కాపులు అందరూ వంశీకి మద్దతు ఇవ్వాలి: సింహాద్రి

image

గన్నవరంలో నామినేషన్ విత్డ్రా అనంతరం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రాఘవేంద్రరావు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యార్లగడ్డ వెంకట్రావుకి రంగా, పవన్ కళ్యాణ్ అంటే కనీస గౌరవం లేదన్నారు. తనను నియోజకవర్గంలో నిలబెట్టి వంశీని ఓడించాలని చూశారని అన్నారు. ఆఫీసులో కనీసం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టుకోలేదని, నియోజకవర్గంలో కాపులందరూ వంశీకి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

News April 29, 2024

BREAKING: ముద్దరబోయిన నామినేషన్ విత్ డ్రా

image

నూజివీడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వర రావు సోమవారం తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. త్వరలో ముద్దరబోయిన దంపతులు చంద్రబాబును కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

News April 29, 2024

కృష్ణా: ఒకే కుటుంబం నుంచి ముగ్గురు MLAలు

image

గుడివాడ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు MLAలుగా పనిచేశారు. 1994 సాధారణ ఎన్నికలలో TDPఅభ్యర్థిగా రావి శోభనాద్రి గెలుపొందారు. 1999లో రావి హరిగోపాల్ TDPతరఫున గెలిచి ప్రమాణస్వీకారం చేయకుండానే రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన సోదరుడు రావి వెంకటేశ్వరరావు 2000లో జరిగిన ఉప ఎన్నికలలో గెలిచారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఒకే నియోజకవర్గంలో MLAలు కావడం విశేషం.

News April 29, 2024

కంకిపాడు: పెమ్మసాని .. మన ‘గొడవర్రు’ అల్లుడే.!

image

దేశంలోనే ధనిక MP (గుంటూరు) అభ్యర్థిగా బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ కంకిపాడు మండలం గొడవర్రుకు చెందిన అల్లుడు అని స్థానిక వాసులు తెలిపారు. గొడవర్రుకు చెందిన కోనేరు రత్నశ్రీ, చంద్రశేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో వీరి పరిచయం ప్రేమ, తర్వాత ‘పెళ్లి’కి దారితీసింది. గొడవర్రులో రెండున్నర ఎకరాల పొలం ఉన్నట్టు ఆయన ఇటీవల నామినేషన్‌లో చూపించారు.

News April 29, 2024

కైకలూరుకు నేడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

image

రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్, వైసీపీ యువజన అధ్యక్షుడులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేడు కైకలూరులో పర్యటనించనున్నారు. ఆయన కైకలూరులోని ఏలూరు రోడ్‌లో వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి సీతారామ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు జరిగే సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యే DNR, MLC జయమంగళ, వైసీపీ నేత బీవీ రావు, పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు. 

News April 29, 2024

విజయవాడ: ఉరివేసుకొని ఆత్మహత్య.. కేసు నమోదు

image

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. కాటూరు నరేంద్ర(36)కృష్ణలంక గుంటూరి వారి వీధిలో ఉంటూ లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు, భార్య నగరంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో నరేంద్ర ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.

News April 29, 2024

అధికారులే ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తారు: ఢిల్లీ రావు

image

విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీ రావు ఆదివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే ఒకటో తారీకు నుంచి పెన్షన్ పంపిణీ మొదలవుతుందన్నారు. డోర్ టు డోర్ డీబీటీ విధానాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నడవలేని, బయటకు రాలేని వారు ఇంటి వద్దే ఉండాలని, అధికారులే ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ అందజేస్తారన్నారు.

News April 28, 2024

కోడూరు: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

మండలంలోని దింటి మెరక ప్రధాన పంట కాలువ గట్టుపై ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. కోడూరు ఎస్సై శిరీష కాలువ గట్టుపై నివసిస్తున్న యానాదుల గుడిసెల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందిందన్నారు. ఈ విషయంపై అవనిగడ్డ సీఐ త్రినాథ్ మృతుడి వివరాలు, మరణానికి గల కారణలపై విచారణ జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు.

News April 28, 2024

కృష్ణా: మే 1న పెన్షన్ దారుల బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ నెల పెన్షన్లను మే 1వ తేదీన పెన్షన్ దారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బ్యాంక్ ఖాతా లేని వారికి సచివాలయ ఉద్యోగులు మే 1 నుంచి 5వ తేదీ లోపు వారి ఇళ్లకు వెళ్లి ఇస్తారని అన్నారు. జిల్లాలో మొత్తం 2,43,400 మంది పెన్షన్ దారులకు రూ.71.75కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పెన్షన్ దారుల్లో 75% మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయన్నారు.

News April 28, 2024

తాడేపల్లి: సీఎం కాన్వాయ్‌ కింద పడ్డ కుక్క

image

తాడేపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వస్తుండగా కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌కి కుక్క అడ్డం పడింది. ఘటనలో కుక్కకు గాయాలు అవ్వడంతో సీఎం పర్సనల్ సెక్యూరిటీ కుక్కని హాస్పిటల్ తీసుకెళ్లమని గన్నవరం పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించి అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భద్రంగా ఉంచారు. పూర్తిగా నయం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోమని సీఎం సెక్యూరిటీ ఆదేశించారు.