India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేశ్ ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసిన ఆయన ఈ ఎన్నికల్లో పెనమలూరు బరిలో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్‌పై పోటీ చేసి 59,915 భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గం మారడం, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడం, టీడీపీ కంచుకోట నుంచి పోటీ చేయడం జోగి రమేశ్ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 మంది MLA అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. కేశినేని చిన్నికి 2,82,085, బాలశౌరికి 2,16,938 మెజార్టీ వచ్చింది. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి 47,032 మెజార్టీతో గెలిచారు.
మచిలీపట్నంలో పొలిటికల్ సెంటిమెంట్ రిపీట్ అయింది. ఇక్కడ గెలుపొందిన పార్టీనే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. ఇది టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతోంది. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన బొర్రా వెంకట స్వామితో ప్రారంభమైన ఈ సెంటిమెంట్ తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలుపొందిన కొల్లు రవీంద్ర మరింత ముందుకు తీసుకువెళ్లారు.
విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ 2019లో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో ఉమ 68,886 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌పై గెలుపొంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో నెగ్గిన ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అంతేకాక ఉమ సాధించిన 68,886 మెజారిటీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ కావడం విశేషం.
కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులపై సర్వత్ర ఉత్కంఠ నెలపొంది. జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, మండలి బుద్ధప్రసాద్ మంత్రి పదవులు రేసులో ఉన్నారు. జిల్లా నుంచి గెలుపొందిన వారిలో వీరిద్దరు సీనియర్లు కావటంతోపాటు సామాజిక వర్గ సమీకరణాలు కూడా వీరికి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. బీసీ సామాజిక వర్గం నుంచి రవీంద్రకు, పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నుంచి గెలుపొందిన బుద్ధప్రసాద్‌కు మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత వెనిగండ్ల రాము తాజా ఎన్నికలలో 53,040 ఓట్ల భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి కొడాలి నానిపై గెలుపొందారు. గుడివాడలో తన ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన రాము ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. రాముకు ఇవే తొలి ఎన్నికలు కాగా మొట్టమొదటి ఎన్నికలలోనే 53,040 ఓట్ల మెజారిటీతో గెలుపొంది గుడివాడ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
గుడివాడ నియోజవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటమిని తట్టుకోలేక, గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ అనే వాలంటీర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాలంటీర్ మృతితో గుడివాడలో విషాదం నెలకొంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఘనవిజయం సాధించారు. నిర్ణీత రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి శివనాథ్ 2,82,085 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి కేశినేని నానిపై విజయం సాధించారు. టీడీపీ ఘనవిజయంతో ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి శ్రేణులు ఫుల్ జోష్‌లో సంబరాలు చేసుకుంటున్నాయి.
విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ కారణంగా కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూలై 1 నుంచి జూలై 14 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని తెలియచేస్తూ.. తాజాగా రైల్వే వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.
*నం.17329 హుబ్లీ- విజయవాడ
*నం.17330 విజయవాడ- హుబ్లీ
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ (వైసీపీ)పై 2,16,938 ఓట్ల మెజార్టీ సాధించారు. బాలశౌరికి 7,12,149 ఓట్లు రాగా సింహాద్రి చంద్రశేఖర్ కు 4,95,211 ఓట్లు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.