India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేపు బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, గుంటూరు జిల్లాల్లో సైతం రేపు వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.
గన్నవరం నియోజకవర్గ ఫలితం అభ్యర్థుల మధ్య దోబూచులాడుతోంది. మొదట్లో వల్లభనేని ముందంజలో ఉండగా.. చివర్లో యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. 22 రౌండ్లు ముగిసేసరికి 36564 ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ముందంజలో ఉన్నారు. మరో రౌండ్ ఫలితం రావాల్సి ఉంది.
రాష్ట్రంలో టీడీపీ కూటమి తరఫున ఆధిక్యంలో ఉన్న ఎంపీ అభ్యర్థులలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని 2వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం చిన్ని 2,43,850 ఓట్ల ఆధిక్యంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా కూటమి ఎంపీ అభ్యర్థులలో నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 2,56,235 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారు.
ఏపీలో బీజేపీ పోటీ చేసిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏడింటిలో ఆధిక్యంలో ఉంది. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులలో విజయవాడ పశ్చిమ MLA అభ్యర్థి సుజనా చౌదరి 10 రౌండ్లు ముగిసేసరికి 31,891 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ.. టాప్‌లో ఉన్నారు. మొత్తం పశ్చిమలో 19 రౌండ్లలో కౌంటింగ్ జరగాల్సి ఉండగా 10 రౌండ్లు పూర్తయ్యేసరికి సుజనా భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సర్నాల తిరుపతి రావుపై 42829ఒట్ల మోజారిటితో గెలుపొందారు. కాగా మైలవరంలో ఇప్పటికే టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా 51,360 ఓట్లు, విజయవాడ తూర్పులో గద్దె రామమోహన్ 39,016, పెనమలూరులో బోడె ప్రసాద్ 36,544 ఆధిక్యంలో ఉన్నారు. కాగా మాజీ మంత్రులు వెలంపల్లి, జోగి రమేశ్ విజయవాడ సెంట్రల్, పెనమలూరులో ఓటమి బాటలో ఉన్నారు.
తిరువూరు: శ్రీనివాస్ 11902
పామర్రు: వర్ల కుమార్ రాజా 11709
నందిగామ: తంగిరాల సౌమ్య 5855
నూజివీడు: కొలుసు పార్థసారథి 2392
జగ్గయ్యపేట: శ్రీరామ్ తాతయ్య 13236
మైలవరం: వసంత కృష్ణప్రసాద్15606
గన్నవరం: వెంకట్రావు 2002
గుడివాడ: వెనిగండ్ల రాము 15668
పెనమలూరు: బోడె ప్రసాద్ 26785
అవనిగడ్డ: బుద్దప్రసాద్ 12864
కైకలూరు: కామినేని శ్రీనివాస్ 9484
పెడన: కృష్ణప్రసాద్ 11264
మచలీపట్నం : రవీంద్ర 15001
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో NDA కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం 41,574 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ రౌండ్లలో బాలశౌరి 1,32,678 ఓట్లు సాధించగా ఆయన ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ 91,104 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ ఇప్పటి వరకు 6,895 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 స్థానాల్లో నూజివీడు మినహా మిగిలిన 15 స్థానాలలో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉంది.
*మచిలీపట్నం
*అవనిగడ్డ
*పామర్రు
*గుడివాడ
*పెనమలూరు
*పెడన
*కైకలూరు
*విజయవాడ పశ్చిమ
*విజయవాడ తూర్పు
*విజయవాడ సెంట్రల్
*మైలవరం
*తిరువూరు
*నందిగామ
*జగ్గయ్యపేట
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఆయనకు భారీ భద్రత కల్పించేలా అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రస్తుతం 155 స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అటు టీడీపీ కేంద్ర కార్యాలయానికి, చంద్రబాబు నివాసానికి టీడీపీ కూటమి శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి.
Sorry, no posts matched your criteria.