India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణా జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలంలోని మాదలవారిగూడెంకు చెందిన ఓ కాలేజీ విద్యార్థులు ఆదివారం కావడంతో స్నానానికి వెళ్లారు. క్వారీ గుంతలో ఏడుగురు ఈతకు వెళ్లగా.. సెల్ఫీలు తీసుకుంటూ అందరూ గల్లంతయ్యారు. వారిలో దుర్గాప్రసాద్, వెంకటేశ్ అనే విద్యార్థులు మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి కేసు నమోదు చేశారు.

ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి బొమ్మల కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బొమ్మల తయారీకి అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారిన నేపథ్యంలో వాటికై వినియోగించే అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ చెట్లు పెంచాలని పవన్ అధికారులను ఆదేశించారని జనసేన తమ అధికారిక x ఖాతాలో పోస్ట్ చేసింది.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీకామ్ జనరల్&కంప్యూటర్ అప్లికేషన్స్) చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 7, 8,9,10,11,12 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీకామ్ జనరల్&కంప్యూటర్ అప్లికేషన్స్) చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 7, 8,9,10,11,12 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్‌సోల్ (17231) రైలు రివైజ్డ్ టైమింగ్స్‌ను శనివారం రైల్వే అధికారులు విడుదల చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.50కి నరసాపురంలో బయలుదేరే ఈ రైలు 11.14కు కైకలూరు, 11.49కు గుడివాడ, మధ్యాహ్నం 12.50కు విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. విజయవాడలో మధ్యాహ్నం 1.05కి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.30 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుందని తెలిపారు.

గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, పీజీ పూర్తి చేసిన 18-40 ఏళ్ల లోపువారు ఈ జాబ్ మేళాకు హాజరు అవ్వొచ్చని చెప్పారు. అభ్యర్థులు https://tinyurl.com/jobmela-gvm లింక్‌లో రిజిస్టర్ అవ్వాలని విక్టర్ బాబు తెలిపారు.

ప్రకాశం బ్యారేజీకి శనివారం భారీగా వరద కొనసాగుతోంది. సాగర్ నుంచి దిగువకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి విడుదల పెరగడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పోటు పెరిగింది. దీంతో 40 గేట్లను 2 అడుగుల మేర, 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 84,297 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.

వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ వైసీపీ నేతలు శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు విజయవాడ రాజ్‌భవన్‌లో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, షేక్ ఆసిఫ్, రాయన భాగ్యలక్ష్మి తదితరులు గవర్నర్‌ను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరిగి, నష్టపరిహారం అందే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.

రాజధాని అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా వెళ్లే విజయవాడ బైపాస్ రోడ్ పనులను సీఎం చంద్రబాబు శనివారం పరిశీలించారు. బైపాస్ రోడ్ పనుల పురోగతి గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, CRDA అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ బైపాస్ రోడ్ పూర్తయితే అమరావతి, విజయవాడ- గుంటూరు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఎద్దడి తగ్గుతుంది.

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రతి రోజూ ఇంద్ర AC బస్సు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
Sorry, no posts matched your criteria.