Krishna

News September 1, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎవరైనా పోలీసు వారి సహాయం పొందాలనుకుంటే వెంటనే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లకు 9491063910కు లేదా 08672 252090 ఫోన్‌ చేసి తక్షణ సహాయం పొందవలసిందిగా కోరారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు 8181960909 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

News September 1, 2024

విజయవాడలో వర్షం.. మీ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది!

image

జిల్లాతో పాటు విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందిస్తూ సహాయక చర్యలు చేపడుతోంది. మరికొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం, చీకటి పడుతుండటంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

News September 1, 2024

కృష్ణా: వర్షాల ఎఫెక్ట్‌.. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు

image

భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వర్షాల ప్రభావంతో మచిలీపట్నం, నరసాపురం, విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ తదితర ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేశామని పేర్కొంటూ దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News September 1, 2024

కృష్ణానది వరద ఉద్ధృతిపై కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్

image

ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున వరద నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆదివారం ఉదయం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

News September 1, 2024

వర్షాల ఎఫెక్ట్..రెండు రోజుల పాటు రైళ్ల రద్దు

image

భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్ రైల్వే మేనేజర్(DRM) కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు విజయవాడ నుంచి డోర్నకల్, గుంటూరు, భద్రాచలం రోడ్ వెళ్లే మెము రైళ్లను సెప్టెంబర్ 1,2వ తేదీలలో రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.

News September 1, 2024

ప్రాణ నష్టాన్ని నివారించాం: కృష్ణా కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం వాటిల్ల లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. 25 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని.. వెంటనే పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపి వేసినట్లు తెలిపారు.

News September 1, 2024

విజయవాడలో ఎస్ఐ సాయం

image

విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో వరద ముంపునకు గురైన ప్రజలను సింగ్ నగర్ ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు పునరావాస కేంద్రాలకు తరలించారు. న్యూ రాజరాజేశ్వరి పేటలో వరద ముంపునకు గురైన ఓ వృద్ధురాలిని పడవలో తీసుకు వచ్చి పునరావాసం కల్పించారు. ఎస్సై శ్రీనివాసరావు ఆర్థిక సహాయం అందించి పునరావాసంలో వసతులు కల్పించారు. పలువురు ఉన్నత అధికారులు ఎస్సైను అభినందించారు.

News August 31, 2024

విజయవాడ: భారీ వర్షాల ఎఫెక్ట్.. రైళ్లు రద్దు

image

భారీ వర్షాల కారణంగా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ప్రయాణించే 20 రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్ రైల్వే మేనేజర్(DRM) కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లలో 15 రైళ్లను ఈ రోజు, రేపు రద్దు చేశామని DRM కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను వర్షాల కారణంగా రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

News August 31, 2024

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కొలుసు

image

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. శనివారం ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంపుకు గురైన ప్రాంతాలలో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

News August 31, 2024

విజయవాడ ఘటనకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం

image

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో బోలెం లక్ష్మీ, మేఘన, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు మృతిచెందడం తెలిసిందే. మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.5 లక్షల నష్టపరిహారాన్ని సీఎం ప్రకటించారు.