India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ఫలితాల కోసం కృష్ణా జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీపీఈడీ/డీపీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్- BLISC డిగ్రీ పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
నేడు విజయవాడలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు ప్రింట్ అండ్ స్టేషనరీ డిపార్ట్మెంట్ డీజీగా పదవీ విరమణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు ఆయన ఘనంగా సత్కరిస్తున్నారు. మరోవైపు తాడేపల్లిలో సీఎం జగన్ ఓఎస్డి ధనుంజయ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ధనుంజయ రెడ్డిని సన్మానించడానికి పలువురు వైసీపీ నేతలు తరలివస్తున్నారు.
రేపు శనివారం కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.
ప్రకాశం బ్యారేజీ 68వ కానా పైనుంచి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు ఆమెను బయటకు తీశారు. పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పదవ తరగతి సప్లిమెంటరీ అడ్వాన్స్‌డ్ పరీక్షలు కృష్ణా జిల్లాలో ముగిశాయి. చివరి రోజైన శుక్రవారం సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా సోషల్ స్టడీస్ పరీక్షకు 1950 మంది విద్యార్థులకు 594 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన 07 కేంద్రాలను సందర్శించగా ఒక్కమాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
మండలంలోని తొర్రగుంటపాలెంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొర్రగుంటపాలెం వచ్చే రోడ్లో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని హైడ్రో మిషన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తిని చిల్లకల్లు ధర్మవరపాడు గ్రామ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి 2,36,726 పెన్షన్లలో 1,80,216 పెన్షన్ దారులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
కృష్ణా వర్సిటీ డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ జ్ఞానమణి శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 5,622మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 2,641మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అలాగే 7,354మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలు రాయగా 46.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అనంతరం ఉపకులపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయం ఇవ్వని విధంగా తాము రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.