India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో 28వ తేదీ బుధవారం నాటికి 56 నిల్వ కేంద్రాలలో 16,65,586 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 35,523 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం 2,739 దరఖాస్తులు గనుల శాఖకు అందాయన్నారు. వీరిలో 2,545 మంది దరఖాస్తు దారులకు 33,181 మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను అందించామని మీనా మీడియాకు తెలిపారు.
ఎన్టీఆర్: మద్యం, దందా అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ చేశారు. మదనపల్లి ఫైల్స్ దహనం కుట్ర తీగలాగితే వైసీపీ పెద్దల మద్యం మాఫియా గుట్టు రట్టయిందన్నారు. క్యాష్ & క్యారీ అక్రమ లావాదేవీలు, వేలకోట్ల లిక్కర్ స్కాం ముడుపుల బాగోతంపై ప్రభుత్వ విచారణలో కీలక ఆధారాలు బయటపడ్డాయని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
కృష్ణా: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి టీడీపీ ప్రభుత్వం ఉరితాడు వేస్తోందని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందడంలేదని, రాష్ట్రంలో మెడికల్ కళాశాలల పురోగతి సైతం కుంటుపడిందని జగన్ వ్యాఖ్యానించారు. వైద్య సిబ్బంది నియామకం, ఆరోగ్యశ్రీ అమలులో వైఫల్యం టీడీపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని జగన్ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
మచిలీపట్నం సర్వజనాసుపత్రిలో 12 మంది స్టాఫ్ నర్సులను అధికారులు విధుల నుంచి తొలగించారు. కొవిడ్ సమయంలో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు దర్యాప్తులో తేలడంతో తొలగించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా నర్సుల నియామకంపై ఆరోపణలు రావడంతో రాజమండ్రి హెల్త్ రీజినల్ డైరెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు. అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందిన 12 మందిని విధుల నుంచి తొలగించారు.
కంకిపాడు మండలం ఈడుపుగల్లులో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కీచక టీచర్ శ్రీనివాస్‌ను డీఈవో తాహెరా సుల్తానా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖాధికారులు స్కూల్ వద్దకు వెళ్లి విచారణ చేసి, నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. శ్రీనివాస్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB), కటక్(CTC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07165 HYB- CTC ట్రైన్‌ను మంగళవారం నుంచి సెప్టెంబర్ 17 వరకు, నం. 07166 CTC- HYB ట్రైన్‌ను బుధవారం నుంచి సెప్టెంబర్ 18 వరకు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.
తనపై దాడికి ప్రయత్నించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరుడు తురక కిషోర్‌పై ఇవాళ నర్సాపురం ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్, సజ్జల ఒత్తిడితోనే పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదని ఆరోపించారు.
ఎన్నో ఆశలతో స్వదేశానికి వస్తున్న మహిళ అకస్మాత్తుగా మరణించిన ఘటన విజయవాడలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ మస్కట్ నుంచి విజయవాడ వచ్చింది. అక్కడి నుంచి బస్సులో తూర్పు గోదావరి జిల్లా కోరుమామిడికి బస్సులో వెళ్తుంది. ఈ క్రమంలో ఆమెకు అకస్మాతుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్వరాజ్య మైదానంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాజీ సీఎం జగన్ పేరు తొలగించిన ఘటనపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న రాత్రి 10 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉన్న జగన్ పేరు తొలగించారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేరుగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
నూజివీడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోవెల వద్ద శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలతో ఐక్యత సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు పెద్ద పాలేరులా పనిచేస్తానన్న మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.