India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏ.కొండూరు మండలం వాళ్లంపట్ల గ్రామంలో తల్లిని కన్న కొడుకు బుధవారం గొడ్డలితో నరికి చంపాడు. పోలీసుల వివరాలు ప్రకారం.. బుజ్జమ్మ(65)ను మద్యం మత్తులో కిరాతకంగా కొడుకు వెంకటేశ్వరరావు బుధవారం సాయంత్రం హత్య చేశాడన్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్ల కృష్ణా తెలిపారు.
ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మచిలీపట్నంలోని పలు లాడ్జ్‌లలో తనిఖీలు చేపట్టారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు గాను ఆయన ఆ తనిఖీలు చేస్తున్నామని తెలపారు. లాడ్జ్‌లలో ఉంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులపై పోలీసు నిఘా నిరంతరం ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తదితరులు ఉన్నారు.
పొరపాట్లకు అవకాశం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును సక్రమంగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై అవగాహన కల్పించారు. కృష్ణా వర్సిటీలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్, తర్వాత EVM ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
విజయవాడలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ముగ్గురు అధికారులకు విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు వలన ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్న స్థానికుల ఫిర్యాదుల మేరకు, నీటిని పరీక్షల కోసం అధికారులు గుంటూరు ల్యాబ్స్‌కి పంపించారు. ల్యాబ్ ఫలితాల అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వర్షిత(24)కు ఫిబ్రవరి 14న తిరువూరు మం. ఎరుకపాడుకు చెందిన గోపితో పెళ్లైంది. అనంతరం ఉన్నత చదువుల కోసం గోపి అమెరికా వెళ్లారు. వర్షితకు ఆరోగ్యం బాలేదని తల్లిదండ్రులు HYD నుంచి సొంతూరుకి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న ఆమె తెల్లారేసరికి బావిలో శవమై కనిపించింది. అనారోగ్య సమస్యలతోనే వర్షిత సూసైడ్ చేసుకుందని తండ్రి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 5 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 14 అసెంబ్లీ, 1 MP స్థానాలు గెలుచుకోగా, తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇబ్రహీంపట్నం సమీపంలో హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి నేడు (బుధవారం) పాలీసెట్-2024లో 27,001- 43,000 వరకు ర్యాంక్ పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని 3 హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని కౌన్సిలింగ్ నిర్వాహకులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లమా పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 1, 3, 5, 6, 7, 8వ తేదీల్లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
– SHARE IT
Sorry, no posts matched your criteria.