Krishna

News August 24, 2024

విజయవాడ: B.TECH చదువుతున్న యువతిపై దాడి

image

విజయవాడ రూరల్ మండలం నున్న పోలీస్ స్టేషన్లో యువతిపై కత్తితో బెదిరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశ్ నగర్‌కు చెందిన యువతి B.TECH చదువుతోంది. ఈ క్రమంలో ఆ యువతిని అనిల్ అనే యువకుడు ఈ నెల 21న కత్తితో బెదిరించి ఎవరితో మాట్లాడవద్దు అంటూ చెంపపై కొట్టి బెదిరించి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నున్న పోలీసులు తెలిపారు.

News August 24, 2024

జిల్లాలో విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్స్‌

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. బాధితుల్లో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయి. మూడు రోజుల తరువాత జ్వరం తగ్గినప్పటికీ ఒళ్లు నొప్పులు, తలనొప్పి వేధిస్తున్నాయి. కుటుంబంలో ఒకరికి వస్తే.. మిగిలిన వారికీ వ్యాప్తి చెందుతోందని బాధితులు తెలిపారు. మూడు రోజులకు మించి జ్వర లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. 

News August 23, 2024

గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి: ఆర్డీవో

image

తిరువూరు మండలం లక్ష్మీపురంలో శుక్రవారం నిర్వహించిన ఉపాధి హామీ పథకం గ్రామసభలో ఆర్డీవో మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామ సభలో 82 రకాల పనులను గుర్తించారు. కార్యక్రమంలో సర్పంచ్ గొల్లమందల శ్రీనివాస్, ఎంపీడీవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

News August 23, 2024

జోగి రాజీవ్‌కు బెయిల్ మంజూరు

image

మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌కు బెయిల్ మంజూరైంది. అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో నిందితుడిగా ఉన్న ఇతనికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. జోగి రాజీవ్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News August 23, 2024

కృష్ణా జిల్లాలో ప్రారంభమైన గ్రామసభలు

image

మహాత్మ గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టబోయే పనులపై కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనగా బంటుమిల్లిలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొన్నారు.

News August 23, 2024

కృష్ణా: గ్రామ పంచాయతీలకు రూ.42.13కోట్లు మంజూరు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం కింద 2 జిల్లాలకు రూ.42.13కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కృష్ణా జిల్లాకు రూ.23.65కోట్లు, ఎన్టీఆర్ జిల్లాకు రూ.18.48 కోట్లు విడుదలైనట్టు అధికారులు తెలిపారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీల నిర్వహణతో పాటు తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించనున్నారు. 

News August 23, 2024

విజయవాడ: విమానంలో మగబిడ్డకు ప్రసవం

image

సింగపూర్ నుంచి చెన్నైకి వస్తున్న దీప్తి అనే మహిళ విమానంలోనే ప్రసవించి. బుధవారం రాత్రి ఆమె సింగపూర్ నుంచి చెన్నైకి బయలుచేరారు. మార్గమధ్యంలో అర్థరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యురాలు, అక్కడున్న మహిళల సాయంతో క్షేమంగా దీప్తికి ప్రసవం చేశారు. అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. విమానం చెన్నై చేరుకోగానే వైద్యబృందం తల్లి, బిడ్డను పరిశీలించి క్షేమంగా ఉన్నారన్నారు. 

News August 23, 2024

విజయవాడ: హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

image

హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. గుణదలలో అరుణ్ కుమార్ అనే వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు బుధవారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారన్నారు. ఈ ఘటనలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నమని చెప్పారు. విద్యాధర్, సుంకర చందు, అరుణ్, గణేశ్ అనే వ్యక్తులను అరెస్టు చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

News August 23, 2024

మాజీ సీఎం జగన్‌ను కలిసిన వైసీపీ లీగల్‌సెల్‌ టీం

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను వైసీపీ విజయవాడ లీగల్‌సెల్‌ న్యాయవాదులు గవాస్కర్, ఆదాం గురువారం కలిశారు. జగన్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు జగన్‌ను కలిసి ఎన్టీఆర్‌ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులపై దృష్టి సారించాలని జగన్‌ వారికి సూచించినట్లు సమాచారం.

News August 22, 2024

కృష్ణా: TODAY TOP NEWS

image

* తిరువూరు: చిరంజీవి మూవీ చూసిన ఎమ్మెల్యే కొలకపూడి
* కంకిపాడుకు CM చంద్రబాబు రాక
* విజయవాడ: టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
* విష ప్రచారం చేస్తున్నారు: ఎంపీ మిథున్ రెడ్డి
* విజయవాడ: బాలికతో ఉపాధ్యాయుని అసభ్య ప్రవర్తన
* విజయవాడ: పార్ట్ టైం జాబ్ పేరిట భారీ మోసం