India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫుడ్ ప్రొడక్షన్, సైకలాజికల్ గైడెన్స్ &కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన ఇయర్ ఎండ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈ నెల 27 నుంచి నవంబర్ 1 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

విజయవాడ పట్టణ పరిధిలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీ శిక్షణా కేంద్రంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 10 నుంచి పీజీ వరకు చదివి 18-35 సంవత్సరాలలోపు వారు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి రూ.10 నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుందన్నారు.

దసరా శరన్నవరాత్రులలో ఐదో రోజైన సోమవారం విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ మహా చండీదేవిగా దర్శనమివ్వనున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించనున్నారు. అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటని, చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని పండితులు తెలిపారు. శ్రీ చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని పురాణాలలో ప్రస్తావించబడిందన్నారు.

రాజు సమర్థుడైతే ఆ రాజ్యం ముందు ప్రపంచమే మోకరిల్లుతుందని ప్రధాని మోదీని ఉద్దేశించి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా ఆదివారం ట్వీట్ చేశారు. ఒకప్పుడు సలహా కోసం ప్రపంచం వైపు చూసే స్థాయి నుంచి నేడు మోదీ నాయకత్వంలో అగ్రరాజ్యాలకు సలహాలు ఇచ్చే స్థాయికి భారత్ చేరుకుందని సుజనా పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకుకు సలహా ఇచ్చే ఉన్నత స్థితిలో దేశం నిలబడటానికి మోదీ నాయకత్వమే కారణమని సుజనా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీ.ఏ.) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 25 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు 17 నుంచి 26 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

గన్నవరం మండలం సూరంపల్లిలో ఓ యువకుడిని గ్రామస్థులు బంధించి పెళ్లి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సూరంపల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రసన్నతో ప్రేమాయణం నడిపారు. కులాలు వేరు వేరు కావడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో శ్రీకాంత్ గ్రామానికి రావడంతో మహిళలు బంధించి ప్రసన్నతో పెళ్లి చేశామని గ్రామస్థులు తెలిపారు.

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా (NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 26 వరకు ప్రతి గురువారం NTSK-SMVB(నం.05952), నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రతి సోమవారం SMVB-NTSK(నం.05951)మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

ఈ నెల 12న రిలీజ్ కానున్న ‘జనక అయితే గనక’ సినిమా స్పెషల్ షోను ఆదివారం మధ్యాహ్నం 1.30గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. సినీ హీరో సుహాస్, హీరోయిన్ సంగీర్తన, ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించనున్నారు. షో అనంతరం 3 గంటలకు చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడనున్నారు.

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లుపై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.

కృష్ణా జిల్లాలో 99% మేర ఈ-క్రాప్ నమోదు, 89% మేర ఈ కేవైసీ పూర్తయినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంటలు ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుని ఈ కేవైసీ చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందటానికి వీలవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.