India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* విజయవాడలో హైటెక్ మోసానికి యత్నం
* జోగి రమేశ్ కేసుపై ఆయన లాయర్లు ఏమన్నారంటే?
* కృష్ణా: వరదలో కొట్టుకుపోయిన రైతు
* విజయవాడ: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ స్పాట్‌డెడ్
* కృష్ణా: జోగి రమేశ్‌కు మరోసారి నోటీసులు
* అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు.. YS జగన్ దిగ్భ్రాంతి
* CM చంద్రబాబుకు పేర్ని నాని సవాల్
రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని తెలుగు యువతి అధిరోహించింది. ఈ పర్వతం రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642మీ(18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటోవోల్కానో, అలాగే ప్రపంచంలోని 10వ-అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ అలవోకగా అధిరోహించారు. ఆమె త్వరలో తాడేపల్లికి రానున్నారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
వికసిత్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ పాలసీని రూపొందించనున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నూతన ఇండస్ట్రీ పాలసీ రూపకల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, సీఐఐల సంయుక్త ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ సమావేశం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బుధవారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడం శుభసూచకమన్నారు.
విజయవాడలో కృష్ణానది వారధిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి 6వ బెటాలియన్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ తారక రామారావుని లారీ ఢీకొట్టింది. దీంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సీఐ బాలమురళీకృష్ణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరువూరు మండలం ముష్టకుంట్ల పడమటి వాగులో రైతు వరద నీటిలో గల్లంతైయ్యాడు. మంగళవారం రైతు అరిసేపల్లి వేణు(45) పశువులను మేపేందుకు వెళ్లాడు. ఇంటికొస్తుండగా పడమటి వాగు వరద నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది పడమటి వాగు పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బయలు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 28 వరకు బెయిల్ పొడగిస్తున్నట్లు తెలిపారు. గన్నవరం పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో ఆయన ఏ72గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేశారు. వల్లభనేని వంశీకి కాస్త ఊరట లభించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్చిలోపు ఇళ్లు నిర్మించకోకుంటే లోన్లు రద్దు అవుతాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళవారం కంకిపాడులో గృహ నిర్మాణ సామగ్రి, నిల్వ గోదాంను ఆయన సందర్శించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, అతిసార కేసుల వివరాలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల DMHOలు ఎం.సుహాసినీ, జి.గీతాబాయి వివరించారు. జూన్, జులై నెలల్లో మలేరియా, డెంగీ- 300,టైఫాయిడ్-800+, అతిసారం కేసులు 208 నమోదయ్యాయన్నారు. విషజ్వరాలు నిర్ధారించిన ప్రాంతాల్లో 50 మీటర్ల పరిధిలో అందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. కుటుంబీకుల వివరాల మేరకు గంపలగూడెంలోని పెనుగొలనుకు చెందిన వెంకటేశ్వరరావు(26) సోమవారం పొలం దున్నేందుకు వెళ్లాడు. వర్షం పడడంతో చెట్టుకిందికి వెళ్లాడు. ఆసమయంలో పిడుగుపడి మృతి చెందాడు. అలాగే దొడ్డదేవర పాడులో వెంకటరమణ(17) పొలంలో పనులు చేస్తుండాగా సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.