India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దన్నే ఆనందరాజుకు ఏడేళ్లు జైలు, జరిమానా పడింది. విజయవాడలోని న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఆనందరాజు.. భర్తతో వేరైన ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు. తల్లి ఇంట్లో లేనప్పుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. మందలించినా తీరు మారకపోవడంతో 2018లో అజిత్ సింగ్ నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు జైలు, రూ.10 వేలు జరిమానా విధించింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. విజయవాడ, గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో నెల కిందట వంద రూపాయలకే 5 కేజీల ఉల్లిగడ్డలు వచ్చేవి. ప్రస్తుతం ఉల్లి కిలో కొనాలంటే రూ.60 పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల వ్యవధిలోనే భారీగా ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు.
* గుడివాడలో అర్ధరాత్రి ఉద్రిక్తత
* కృష్ణా జిల్లాలో కొత్త రేషన్ కార్డులు
* విజయవాడలో ఇంటర్ విద్యార్థి సూసైడ్
* కృష్ణా జిల్లాలో డాక్టర్‌పై పేషెంట్ దాడి
* మచిలీపట్నంలోని ఇంట్లో చోరీ
* తిరువూరులో బాలికపై అత్యాచారం
* కృష్ణా: అన్న క్యాంటీన్‌కు రూ.కోటి విరాళం
రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్‌కు ఈ మేరకు రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోహిత్‌ను అభినందించారు.
ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో దస్త్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడలో తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. దస్త్రాలను ధగ్ధం చేసినా, పాడుచేసినా సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ అని వ్యాఖ్యానించారు. ప్రజలంతా తమ కుటుంబాలతో ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకోవాలని మంత్రి ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమెరాను తీసుకుని స్వయంగా ఫొటోలు క్లిక్ మనిపించారు. నాణ్యమైన సేవలతో ఫొటోగ్రఫీ రంగం బాగుండాలని సీఎం ఆకాంక్షించారు.
ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన వాంబేకాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వాంబేకాలనీ బీ-బ్లాక్‌కు చెందిన షేక్ కేశవ ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకున్నాడు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా వేలాడుతున్నాడు. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో అర్హులైన పేదలకు కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. పండగలకు రేషన్ కార్డుదారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలు రానున్నాయి.
పెనమలూరు మండలం పోరంకి నారాయణపురం కాలనీలో పేకాట శిబిరంపై CCS పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పేకాట డెన్ నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సుమారు 26 మంది అరెస్ట్ చేసి రూ.3లక్షలపైగా నగదు స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. కొన్ని నెలలుగా ఈ పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నా పోలీసులు దాడులు చేయకపోవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.