Krishna

News August 18, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్నందున నం.13351 ధన్‌బాద్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ సెప్టెంబర్ 2 నుంచి 29 వరకు తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు.

News August 18, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 19న ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సికింద్రాబాద్-నరసాపురం(నం.07176) & సికింద్రాబాద్-కాకినాడ టౌన్(నం.07188), 20న సికింద్రాబాద్- కాకినాడ టౌన్(నం.07178) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఈ రైళ్లు విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News August 18, 2024

కృష్ణా: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

ట్రాక్ భద్రతా పనులు చేస్తున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌(నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు సెప్టెంబర్ 2 నుంచి 28 వరకు ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక గుడివాడ-భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల మధ్య ఈ రైలుకు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు.

News August 18, 2024

తగిన మూల్యం చెల్లించక తప్పదు: మాజీ మంత్రి దేవినేని 

image

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫైళ్ల దహనం ఘటనల వెనుక వైసీపీ కుట్ర ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. చేసిన పాపాల సాక్ష్యాలను మాయం చేసేందుకు ఈ విధంగా దస్త్రాలకు నిప్పు పెడుతున్నారని ఉమ ఆరోపించారు. ఫైళ్ల దహనంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని, సాక్ష్యాలు బూడిద చేసి తప్పించుకోవాలనుకునే వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఉమ Xలో పోస్ట్ చేశారు.

News August 18, 2024

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం

image

అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల పరిధిలోని పాలకాయతిప్ప సమీపంలో సముద్రంతీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో ఐదుగురు యువకులు స్నానానికి వెళ్లారు. వీరిలో ఒకరు మృతిచెందగా మరొ వ్యక్తి గల్లంతలయ్యాడు. మైరెన్ పోలీసులు ముగ్గురిని కాపాడారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News August 18, 2024

విజయవాడ మీదుగా వన్ వే స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా మధురై- ముజఫర్‌పూర్ (నం.06114) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 18న సాయంత్రం 7.05 గంటలకు మధురైలో బయలుదేరే ఈ ట్రైన్ 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 21వ తేదీన 2.45 గంటలకు ముజఫర్‌పూర్ చేరుకుంటుందన్నారు.

News August 18, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి జిల్లా మీదుగా సంబల్‌పూర్(SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 21 నుంచి నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం SBP- ED(నెం.08311), ఆగస్టు 23 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం ED- SPB(నెం.08312) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News August 17, 2024

ఎన్టీఆర్: కోర్టుకు హాజరైన మాజీ మంత్రి దేవినేని ఉమ

image

2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసు విచారణ నిమిత్తం మహారాష్ట్రలోని బిలోలి కోర్టులో శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమ హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో అప్పటి సీఎం చంద్రబాబు సహా 16 మందికి న్యాయస్థానం నోటీసులిచ్చిందని ఉమ తెలిపారు. నేడు జరిగిన విచారణకు తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, హనుమంత్ షిండేలతో కోర్టు విచారణకు హాజరయ్యామని ఉమ స్పష్టం చేశారు.

News August 17, 2024

కృష్ణా: ఎం- ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన ఎం-ఫార్మసీ కోర్సు పరీక్షల 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News August 17, 2024

విజయవాడ: ద్విచక్రవాహనదారులకు పోలీసులు హెచ్చరికలు

image

ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేయకూడదని డీసీపీ చక్రవర్తి స్పష్టం చేశారు. ఒకవేళ మార్పు చేస్తే వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్‌పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో ఆయన ద్విచక్ర వాహన మెకానిక్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా బైకుల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని తెలిపారు.