Krishna

News August 17, 2024

విజయవాడ: ద్విచక్రవాహనదారులకు పోలీసులు హెచ్చరికలు

image

ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేయకూడదని డీసీపీ చక్రవర్తి స్పష్టం చేశారు. ఒకవేళ మార్పు చేస్తే వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్‌పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో ఆయన ద్విచక్ర వాహన మెకానిక్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా బైకుల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని తెలిపారు.

News August 17, 2024

కృష్ణా జిల్లాలో అన్న క్యాంటీన్లపై మీ కామెంట్..!

image

కృష్ణా జిల్లాలో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. తొలిరోజు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి భోజనం చేశారు. ఇంతకీ ఈ క్యాంటీన్లలో మీరు భోజనం చేశారా? రుచి ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగ పడే ప్రాంతాల్లో క్యాంటీన్లు పెట్టారా? ఇంకా ఎక్కడెక్కడ క్యాంటీన్లు పెట్టాలి? అనేది మీరు కామెంట్ చేయండి.

News August 17, 2024

జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్ వాయిదా

image

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు సెలవులో ఉండడంతో ఈ కేసును 12వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం విచారించింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో విచారణ వాయిదా పడింది.

News August 17, 2024

కృష్ణా: నేడు వైద్య సేవలు బంద్‌

image

కోల్‌కత్తాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారాన్ని నిరసిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) వైద్య సేవల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి. అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన ఓపీ, ఐపీ, స్కానింగ్‌, రక్త, ఇతర పరీక్షలను 24 గంటలపాటు నిలిపివేయనున్నారు. గుడివాడ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలిపింది.

News August 17, 2024

మచిలీపట్నంలో హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎస్పీ

image

పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించగలమని ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని పోలీస్ కల్యాణ మండపంలో సిబ్బంది & వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News August 16, 2024

విజయవాడ: పోలీసుల అదుపులో ప్రేమజంట

image

విజయవాడకు చెందిన పొట్లూరి అలేఖ్యచౌదరి, మందడంకు చెందిన సాంబశివరావు 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో అలేఖ్య తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇంట్లో తెలియకుండా ఆగస్టు 15న పెళ్లి చేసుకుని శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుపతి వస్తుండగా తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని, తమకి రక్షణ కల్పించాలని అలేఖ్య వీడియో మెసేజ్ చేసింది.

News August 16, 2024

NTR జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీ

image

NTR జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఎస్ఐలను భారీగా బదిలీ చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఏలూరు రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 100 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా వీఆర్‌లో ఉన్నా ఎస్ఐలకు స్థానచలనం కల్పించారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు.

News August 16, 2024

విజయవాడ: బార్‌లో మద్యం తాగి వ్యక్తి మృతి

image

విజయవాడ సింగ్ నగర్‌లోని రూప లక్ష్మీ సాయి బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవించి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 16, 2024

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు కూడా ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నారు. అనంతరం శనివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News August 15, 2024

అన్న క్యాంటీన్లో భోజనం చేసిన సీఎం చంద్రబాబు దంపతులు

image

గుడివాడ మునిసిపల్ పార్క్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అన్నా క్యాంటీన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం వారు ఆ అన్నక్యాంటీన్‌లో భోజనం చేశారు.